రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.  సినిమా రిలీజ్ కు ముందు వరకు సినిమాకు హైప్ వస్తుంది.  తీరా సినిమా చూస్తే అందులో కంటెంట్ పెద్దగా ఉండదు.  బాబోయ్ ఎందుకు వచ్చామా అనుకుంటారు.  ఇలా వర్మ ఎన్నోసార్లు నిరాశపరిచారు.  బయోపిక్ సినిమాలు మాత్రం వర్మ తీసే విధంగా మరెవరూ తీయలేరు.  అందులో సందేహం అవసరం లేదు.  రక్త చరిత్ర, కిల్లర్ వీరప్పన్, సర్కార్, వంగవీటి ఈ సినిమాలన్నీ కూడా వర్మ హిట్ ఖాతాలో ఉన్నవే.  


వర్మకు తిక్క ఎక్కువ అందుకే సినిమాలు కూడా అలానే బోల్తా కొడుతుంటాయి.  వర్మ నేను చెడ్డవాడిని, మంచి వ్యక్తిని కాదు, నాకు బంధాలు, బంధుత్వాలు లేవు. అమ్మాయి అంటే అందం మాత్రమే అని చెప్తుంటాడు.  అలాంటి వర్మ గురించి వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలు తెలిస్తే మాత్రం వర్మ అలాంటి వాడు కాదు అని తెలుస్తుంది.  ప్రతి తల్లికి తన కొడుకు అలానే కనిపిస్తాడు.  కానీ, వర్మతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వర్మ గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడలేదు.  


అంతవరకూ ఎందుకు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే శ్రీరెడ్డి, వర్మ విషయంలో మాత్రం ఎలాంటి కామెంట్లు చేయలేదు.  పైగా ఆమె వర్మకు ఓపెన్ అఫర్ ఇచ్చింది కూడా.  దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.  వర్మ ఎలాంటి వ్యక్తో.  ఇకపోతే, ప్రస్తుతం వర్మ బ్యూటిఫుల్ సినిమా తీశారు.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  వర్మ సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  అయితే, వర్మసినిమా పాయింట్ గురించి చెప్పాడు.  ఓ అమ్మాయి అబ్బాయి కంటే ఎదిగితే ఆ అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని చుట్టూనే సినిమా ఉంటుందని అంటున్నాడు.  


ఈ కాన్సెప్ట్ తో గతంలో ఆషీకీ 2 సినిమా వచ్చింది.  ఈ సినిమాలో కూడా సింగర్ శ్రద్దా కపూర్ హీరో కంటే బాగా పాడుతుంది.  మంచి పేరు తెచ్చుకుంటుంది.  దాంతో డిప్రెషన్ లోకి వెళ్తాడు. దేశంలోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సింగర్, ఆ తరువాత ఒక అమ్మాయి డామినేట్ చేయడంతో తట్టుకోలేకపోతాడు.  చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలాంటి రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంటాయి.  తనకంటే కూడా పై స్థాయిలో ఎదుగుతున్నారు అంటే భయపడతాం.  వాళ్ళను తొక్కేయాలని చూస్తారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: