డయల్  100 కి  ఫోన్ చేస్తే పోలీసులు ఏం చేస్తారు... ఏదైనా ప్రమాదంలో ఉంటే వచ్చి రక్షిస్తారు. కానీ ఇక్కడ మాత్రం డయల్ 10p కు ఫోన్ చేసి నందుకు... ఎందుకు చేసావ్ అంటూ గొంతు నులిమి  దాడి చేశారు పోలీసులు. అది కూడా ఓ సాదాసీదా మనిషి పై కాదండోయ్. టాలీవుడ్ నిర్మాత తనయుడిపై. ఇక ఈ విషయం  తెలిసిన టాలీవుడ్ నిర్మాత పోలీస్ స్టేషన్ కు  వెళ్లి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... బేగంపేటలోని కంట్రీ క్లబ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిర్మాత నట్టి కుమార్ తనయుడు క్రాంతి ని అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. 

 

 

 

కారు పార్కింగ్ చేస్తామంటూ తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో నట్టికుమార్ తనయుడు క్రాంతి 100కు ఫోన్ చేసి పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశాడు. అయితే కంట్రీ క్లబ్ కు చేరుకున్న పోలీసులు... నేరుగా క్రాంతి వద్దకు వెళ్లి డయల్ 100 కి  ఎందుకు ఫోన్ చేసావు అంటూ అతనిపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు  వెళ్లి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. డయల్  100 కు ఫోన్ చేస్తే హెల్ప్ చేయాల్సింది పోయి దాడి చేసి కొడతారా అంటూ పోలీసులను  ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడి మెడ పట్టుకొని గొంతునులిమి దాడికి పాల్పడ్డారంటూ పోలీసుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదానికి దిగారు. దీంతో పోలీస్ స్టేషన్లో  ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . 

 

 

 

 దీంతో దిగివచ్చిన పోలీసులు నిర్మాత నట్టి కుమార్ కు ఆయన తనయుడు క్రాంతి కి  క్షమాపణలు చెప్పడంతో రవికుమార్ శాంతించారు. కాగా  కంట్రీ క్లబ్ లో బ్యూటిఫుల్ సినిమా ప్రమోషన్ చేస్తామని ఈవెంట్ మేనేజర్ తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని కానీ ఫోన్ చేయలేదని నట్టికుమార్ ఆరోపించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రావాల్సి ఉందని... కంట్రీ క్లబ్ లో  బ్యూటిఫుల్ సినిమాను ప్రమోషన్ చేసేందుకు తమ వద్ద డబ్బులు తీసుకుని ఈవెంట్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ ఆరోపించారు నట్టికుమార్. ఈవెంట్ మేనేజర్ సుమన్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ నట్టికుమార్ పోలీసులను డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: