ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు.. రెండు సెంటిమెంట్ సీన్లు.. సినిమా అంటే ఇదే ఫార్మెట్ లో ఉండాలనే మూస ధోరణిలోనే ఇన్నాళ్ళు సినిమాలు వచ్చాయి. అయితే కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు. అయితే దశాబ్ధ కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కంటెంట్ ఉన్న సినిమా అది స్టార్ హీరోదా కాదా అని చూడట్లేదు కొత్త వాళ్లైనా సరే ప్రేక్షకుడి మనసుకి నచ్చితే ఆ సినిమాను అందలం ఎక్కిస్తున్నారు. 

 

ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈమధ్య కాలంలో వచ్చిన మార్పు ఊహించలేదని చెప్పొచ్చు. అయితే కొత్త దర్శకుడు ఇలాంటి వెరైటీ సబ్జెక్ట్ సినిమాలతో వస్తుంటే కొంతమంది దర్శకుడు ఆల్రెడీ ఒక క్రేజ్ వచ్చిన డైరక్టర్స్ మాత్రం రొటీన్ పంథా ఫాలో అవుతున్నారు. వారు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటి హిట్ ఫార్ములాతోనే సినిమాలు చేస్తారు.

 

ఎలాంటి కథ అయినా సరే వారి చేతిలో పడితే అంతే సంగతులు. కథ కథనాలు ఎలా ఉన్నా వారి సినిమా మాత్రం ఫార్మెట్ ఒకటే అన్నట్టు ఉంటుంది. ఇలాంటి సినిమాలకు టీజర్, ట్రైలర్ చాలా పర్ఫెక్ట్ గా కట్ చేస్తారు. ట్రైలర్ చూసి సినిమాలో విషయం ఉందని థియేటర్ కు వెళ్తే మాత్రం ఆడియెన్స్ మోసపోయినట్టే. సినిమాలో హైలెట్ సీన్స్ అన్ని కలిపి ట్రైలర్ లో ఉంచుతారు. ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని భారీ అంచనాలతో సినిమాకు వెళ్తే చుక్కలు చూపిస్తున్నారు.

 

పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలు.. అల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసిన కథలతో ఇప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నారు. మరి ఆ దర్శకులు టైం పాస్ కు ఇలాంటి సినిమాలు చేస్తున్నారేమో కాని ఆడియెన్స్ మాత్రం ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలాంటి సినిమాలు తీసి నిర్మాతల ఖజానాను ఖాళీ చేయడం కన్నా కొత్త కథలతో వస్తే బెటర్ అని అంటున్నారు సిని విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: