టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టి సినీ నటుడిగా మారాడు మాస్ మహరాజ రవితేజ.  కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ మూవీతో హీరోగా మారాడు.  ఈ మూవీలో రవితేజ చంటిగాడి పాత్రలో నటించి యువత మనసు దోచాడు.  మొదటి నుంచి పూర్తి మాస్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన రవితేజ ప్రముఖ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ లో అత్తిలి సత్తి పాత్రలో దుమ్మురేపాడు.  ఇలా వరుసగా విజయాలతో దుమ్మురేపిన రవితేజకు పవర్ మూవీ తర్వాత వరుస పరాజయాలు వచ్చాయి.  దాంతో రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫిట్ నెస్ పై దృష్టి సారించారు.  

 

 అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజాది గ్రేట్ ’మూవీతో మరోసారి తన మాస్ రేంజ్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు.  ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత రవితేజ నటించిన నాలుగు సినిమాలు మళ్లీ ఫ్లాప్ అయ్యాయి.  దాంతో రవితేజ ఈసారి తన మార్క్ చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాస్ ఎలిమిమెంట్స్ ఉన్న సినిమాలతో పాటు, ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ ఉన్న మూవీస్ పై శ్రద్ద చూపిస్తున్నారు  ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’ మూవీ జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

 

సినిమా విడుద‌ల కాక‌ముందే గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించనున్నారు . ఈ మూవీలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం. ర‌వితేజ‌, శృతి హాస‌న్, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన బ‌లుపు మూవీ మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.  ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: