ప్రపంచ వ్యాప్తంగా నిన్న రాత్రి పాత సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సంబురాల్లో మునిగిపోయారు.  పన్నెండు గంటల తర్వాత కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ.. ఆనందోత్సాహాల మద్య హుషారెత్తించారు.  ప్రస్తుతం యువత ఇలాంటి ఎంజాయ్ మెంట్ బాగా చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం రక రకాల పద్దతుల్లో చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక న్యూఇయర్ వేడుకలు సెలబ్రెటీలు ఎలా చేసుకుంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  కొంత మంది ఈ వెకేషన్ వేరే దేశాలకు వెళ్లి చేసుకుంటారు.  మరికొంత మంది భారత దేశంలో ప్రముఖ ప్రదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ చేసుకుంటారు. 

 

కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు కొందరు దేవాలయాలకు వెళ్లడం చూస్తున్నాం.  మరికొంత మంది సెలబ్రేటీలు స్టార్ హోటల్స్ కి వెళ్లడం  చూస్తున్నాం. ఇక న్యూ ఇయర్ మాత్రమేకాదు ఎలాంటి వెకేషన్స్ అయినా అల్లు అర్జున్ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తుంటారు.  విదేశీ పర్యటనలో తన భార్యతో తీసుకున్న ఫోటోలు షేర్ చేస్తుంటారు.  ఇక బన్ని తన పిల్లలు చేసే అల్లరి తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ తెగ ఆనందపడిపోతుంటారు. నిన్న రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుకలు అంత‌టా ఘ‌నంగా జ‌రిగాయి. సామాన్యుల నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు పార్టీలో మునిగి తేలారు.

 

 కొంత కాలంగా సినిమా షూటింగ్ బిజీలో ఉన్న సినీ తారలు నిన్న ఒక్కరోజు గ్యాప్ తీసుకొని మరీ ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న శ్రీమ‌తితో క‌లిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేశాడు. ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.  ప్రస్తుతం బన్ని ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అలా వైకుంఠపురములో’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుద‌లైన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా.. సాంగ్ టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ని రెట్టింపు చేసింది. ఇక నిన్న అల్లు అర్జున్ చేస్తున్న ఎంజాయ్ మెంట్ కి సంబంధించి ఫోలో ప్రస్తుతం సోసల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: