న్యూయార్ రోజున ప్రతి ఒక్కరు పండుగలా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే..  కొత్త సంవత్సరం అంటే ఉండేది కొత్త రుచి, కొత్త కోరికలు, కొత్త ఆశలు, కొత్త వాహనాలు, ఇల్లు ఇలా ఒక్కటేమిటి కొత్తగా ఏంచేసినా కూడా అది కొత్తగా ఉంటుంది. యావత్ ప్రపంచం ఈ రోజున అంబరాలు ఎక్కించేలా సంబరాలు జరుపుకుంటారు అన్న విషయాన్నీ ప్రత్యేకకంగా చెప్పనక్కర్లేదు. ఎవరికీ ఉన్న దాంట్లో వారు ఈ పండుగను జరుపుకుంటారు.

 ఇకపోతే సినిమా వాళ్ళ విషయానికొస్తే ఈ దూకుడు మరింత ఎక్కువనే చెప్పాలి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కొత్త సంవత్సరానికి కొత్తగా సరికొత్తగా ట్రై చేస్తుంటారు.ఈ మేరకు సినీ తారల సందడి కూడా మరింత పెరిగిందనే చెప్పాలి. గతంలో ఏంచేశామో కాదు.. ఇప్పుడు ఏంచేయాలో అని ఆలోచించాలంటూ కొత్త ఏడాది స్వాగతం పలుకుతూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇలా శుభాకాంక్షలు తెలియజేయటంలో ప్రతీ ఒక్కరూ తమ ప్రత్యేకతను చూపించారు. 

సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు తమ విషెష్ ను తెలిపారు. ఎవరి స్టయిల్లో వారు జనాలకు శుభాకాంక్షలు తెలియజేసారు. వివరాల్లోకి వెళితే.. 

మహేష్ బాబు..

గతం గతః ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటూ ఆలోచించాలని ఆయన అన్నయు. దేవుడి దయ ప్రతిఒక్కరి మీద ఉండాలని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ..

ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ సింపుల్‌గా శుభాకాంక్షలు తెలియజేశాడు.తెలుగు ఇంగ్లీస్ భాషల్లో శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్‌ అందరికీ సుఖ, సంతోషాలు కలగాలని ఆకాంక్షించాడు.

రవితేజ..

రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ప్రస్తుతం మరో సినిమాలో ఈయన నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేస్తూ న్యూయార్ విషెష్ తెలియజేసారు.

ఎఆర్ రెహమాన్ ..

సంగీత మానస పుత్ర రెహమాన్ గారు ప్రజలు అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ విషెస్ తెలియజేసారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: