మన టాలీవుడ్ లో బాగా పేరు మోసిన కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పటినుంచో ఉన్న ట్రెండ్. ఇదేమీ పెద్ద కొత్త కాకపోయినా అప్పట్లో స్టార్ కమెడియన్స్ మాత్రమే హీరోలుగా సినిమాలు చేసేవారు. బ్రహ్మానందం, అలీ సునీల్ వీరంతా అప్పట్లో ఒక టాప్ పొజిషన్ లో ఉన్న వారే అయినా కూడా హీరోగా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించలేక చతికిల పడిపోయారు. కొంతమంది అయితే కనీసం ఇండస్ట్రీలో పునరాగమనం చేసేందుకు కూడా వీలు లేకుండా అర్థాంతరంగా ఆగిపోయారు.

 

అయితే ఇప్పుడు మాత్రం చిన్న కమీడియన్ గా జనాల్లో కొంచెం గుర్తింపు తెచ్చుకుంటే చాలు అందరూ హీరోలుగా మారిపోతున్నారు. అదే కేటగిరీకి చెందిన వారు సప్తగిరి మరియు షకలక శంకర్. ఇప్పుడు వారికి తోడుగా సుడిగాలి సుదీర్ 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాలంలో పెద్ద హీరోల సినిమాల్నే సరిగ్గా ప్రేక్షకులు పట్టించుకోకపోగా చిన్న సినిమాల సంగతి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

 

సినిమాలో కంటెంట్ అద్భుతమైతే తప్ప ఆ సినిమాను చూసేందుకు ఎవరూ టికెట్ పై ఖర్చుపెట్టేందుకు రెడీగా లేరు. ఇలాంటి సమయంలో రోటీన్ ఫార్మాట్ లో.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన 'సాఫ్ట్ వేర్ సుధీర్' ను ఎవరు పట్టించుకుంటారు? ప్రేక్షకులే కాదు.. రివ్యూయర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వచ్చిన ఒకటి అరా రివ్యూలలో ఈ సినిమా సుడిగాలి సుధీర్ అభిమానులకు ఓకే కానీ మిగతా వారు చూడడం కష్టమే అనే అభిప్రాయం వెలిబుచ్చారు.

 

అయితే సుధీర్ మాత్రం ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈసారి ఇంకా మంచి రీతిలో సినిమా తీసి ప్రతి ఒక్కరని మెప్పిస్తానని హామీ ఇస్తున్నాడు. సుడిగాలి సుధీర్ తన ప్రేక్షకులను మెప్పించడానికి తాను ఎంతైనా కష్టపడడానికి సిద్ధం అని చాలెంజ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: