ఈ మద్య చిన్న సినిమాల జోరు బాగా పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున పోరాటం చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెన చేసిన హంగామాకు యావత్ భారత దేశం మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసింది. తనకు మా అసోసియేషన్ కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శచే చేసింది. దాంతో నేషనల్ మీడియా సైతం తెలుగు ఇండస్ట్రీ గురించి కోడై కూసింది.
ఇలా కాస్టింగ్ కౌచ్ పై వివిధ మీడియాల్లో తనదైన బూతు పురాణంతో హల్ చల్ చేసింది. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ ఉద్యం మంచి పొజీషన్ లో ఉండగా పవన్ కళ్యాన్ పై బూతులు మాట్లాడటం.. ఆమె ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడంతో చెన్నైకి చెక్కేసింది. నటి శ్రీరెడ్డి వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు తెర లేపింది. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేశారు. అయినప్పటికీ రాజకీయ, సినీ అంశాలపై తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరుతో టాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఆర్యన్, ఉపాసన జంటగా రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'శ్రీరెడ్డి దొరికిపోయింది'. అయితే ఈ మూవీకి మానవ మృగాలు అనే ఉపశీర్షిక పెట్టారు. న్యూఇయర్ కానుకగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది.ఈ మూవీ యశ్వంత్ మూవీస్ పతాకంపై డి. వెంకటేష్ నిర్మిస్తున్నారు. గణేశ్ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన నటిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.