ఐటం సాంగ్ విషయంలో మహేశ్ ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. మరే స్టార్ హీరో సూపర్ స్టార్ ను ఫాలో కాలేకపోతున్నాడు. ప్రత్యేక గీతంలో నటించాలంటే ముందే ఓ కండీషన్ పెడతాడు. దర్శకనిర్మాతలు తను చెప్పినట్టు వింటేనే ఐటం సాంగ్ లో చిందులేస్తాడు మహేశ్. ఇంతకీ ప్రత్యేక సాంగ్ విషయంలో మహేశ్ కు ఉన్న ఆబ్లిగేషన్ ఏంటో తెలుసా...!఍

 

మహేశ్ బాబు ఐటం సాంగ్ చేసి ఐదేళ్లయింది. ఆ మధ్య తరచుగా ఇలాంటి పాటలు చేసినా.. ఆగడు తర్వాత ఐటం సాంగ్ జోలికి పోలేదు. కథ రీత్యా ఆ అవసరం కూడా రాకపోవడంతో హీరోయన్స్ తో డ్యూయెట్స్ తో సరిపెట్టుకున్నాడు మహేశ్. 

 

తన సినిమాలో ఐటం సాంగ్ ఉంటే.. రెగ్యులర్ ఐటం గర్ల్స్ ను కాకుండా.. హీరోయిన్స్ నే ప్రిఫర్ చేస్తాడు మహేశ్. సైనికుడులో కామ్న జఠ్మలానీ.. దూకుడులో పార్వతి మిల్టన్.. ఆగడులో శృతిహాసన్.. నేనొక్కడినే కోసం బాలీవుడ్ నుంచి సోఫియా చౌదరిని తీసుకొచ్చారు. మహేశ్ ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే.. ప్రత్యేక గీతాల్లో హీరోయిన్సే మెరిశారు. 

 

ఆగడు తర్వాత ఈ ప్రత్యేక గీతాలకు దూరంగా మహేశ్.. సరిలేరు నీకెవ్వరుతో మరోసారి ఐటం గర్ల్ తో ఆడిపాడాడు. హీరోయిన్స్ తోనే చిందేసే మహేశ్.. ఈ సారి ఐటం ఛాన్స్ తమన్నాకు ఇచ్చాడు. ఇలాంటి సాంగ్స్ లో ఎక్స్ పర్ట్ అయిన తమన్నా.. ఆగడులో మహేశ్ తో జతకట్టగా.. ఈ సారి ఐటం పాపగా మెరిసింది. మొత్తానికి మహేశ్ ఐటం సాంగ్స్ విషయంలో ప్రత్యేక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఐటం సాంగ్స్ ఒకవేళ పెడితే హీరోయిన్స్ నే పెట్టాలంటూ కొత్త రూల్స్ పెడుతున్నాడు. తద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. మహేశ్ బాబు అభిమానులు ఆయన నిర్ణయాలకు జైకొడుతున్నారు. మరింత కొత్తదనంతో తన అభిమాన హీరో రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: