శ్రీరెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్‌లోని పెద్దపెద్ద వాళ్లపై తీవ్ర ఆరోపణలు చేసిందామె. అర్ధ నగ్నంగా కూర్చొని పబ్లిక్ లో నానా హంగామా చేసింది. టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపేసి ప్రస్తుతం చెన్నైలో రిలాక్స్ అవుతోంది. అక్కడి నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కామెంట్‌లు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇంత వివాదాస్పదమైన నటి పేరుతో టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త సినిమా రూపొందుతోంది.

 

ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేశారు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమాగా ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాతో శ్రీరెడ్డి నటించకపోయినా .. ఎలాంటి సంబంధం లేకపోయినా టైటిల్‌లో ఆమె పేరును వాడటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఇక ఈ పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక అమ్మాయి చేతిలో కత్తి, ఆమె ముఖంపై రక్తపు మరకలు, ఆమె ముఖంలో కోపం చూస్తుంటే ఇదేదో మగ మృగాలపై రివేంజ్ స్టోరీలా అనిపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు. మరి ఈ సినిమాలో నిజంగా అంత కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సస్ అయ్యో అవకాశాలున్నాయి. లేదంటే అటు ల్యాబ్ కో లేక నాలుగైదు థియోటర్స్ కో పరిమితం అవుతుంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: