స్టార్ హీరోయిన్ ఏంటి, సెక్స్ వర్కర్ గా మారడం ఏంటి అనుకుంటున్నారా, సెక్స్ వర్కర్ గా మారిన మాట నిజమేనండి, అయితే అది సినిమా కోసం మాత్రమే. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదా, ఆ తరువాత తెలుగులో అక్కడక్కడా కొన్ని విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఒకానొక సమయంలో కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన అపరిచితుడు సినిమాలో నటించి ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ, ఆ విజయం ఆమెకు ఎక్కువ కాలం నిలవలేదు. 

 

ఆ తరువాత మధ్యలో కొన్ని కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించిన సదా, తెలుగులో మాత్రం ఆ తరువాత సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇక ఇటీవల కూడా తెలుగులో ఆమెకు అక్కడక్కడా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ, వాటిని విజయాలుగా మాత్రం సదా మలుచుకోలేకపోయింది. ఇకపోతే గత ఏడాది తమిళ్ లో రిలీజ్ అయిన టార్చ్ లైట్ అనే ఉమెన్ సెంట్రిక్ డ్రామా మూవీలో సెక్స్ వర్కర్ గా నటించిన సదా, కెరీర్ పరంగా తొలిసారి ఆ విధంగా సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో నటించి, అందరినీ మెప్పించింది. కథ తనకు ఎంతో బాగా నచ్చడంతోనే ఇటువంటి పాత్రకు తాను ఓకే చెప్పానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా సదా చెప్పింది. 

 

అయితే ఇటువంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లు ముందుకు రారని, అయితే ఇటువంటి ఛాలెంజింగ్ రొల్స్ లో నటిస్తున్నపుడే మనలోని నిజమైన నటన వెలుగులోకి వస్తుందని, అందుకే దర్శకుడు మజిత్ కథ చెప్పినపుడే తనకు ఈ క్యారెక్టర్, కెరీర్ పరంగా ఎంతో హెల్ప్ అవుతుందని భావించినట్లు ఆమె అన్నారు. కాగా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక ఆ సినిమా ద్వారా సదాకు పెద్దగా కొత్త అవకాశాలు అయితే లభించలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం పలు సినిమా కథలు వింటున్న సదా, మధ్యలో ఈటీవీలో ప్రసారం అయిన ఢీ జూనియర్స్ షోకు జడ్జిగా వ్యవహరించారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: