టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే రెండవసారి బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ, సునీల్, రాహుల్ రామకృష్ణ, నవదీప్, జయరాం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్, ప్రేక్షకుల్లో అలానే బన్నీ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ కు యూట్యూబ్ లో అత్యధిక స్థాయిలో వ్యూస్ అలానే లైక్స్ దక్కాయి. ఇకపోతే సామజవరగమనా సాంగ్ ని ఇటీవల ప్యారిస్ లోని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో అక్కడి అధికారుల పెర్మిషన్ తీసుకుని చిత్రీకరించిన అలవైకుంఠపురములో యూనిట్, దాని కోసం దాదాపుగా ఆరుకోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి విదేశాల్లో సాంగ్స్ చిత్రీకరణకు అంత ఎక్కువగా ఖర్చు అవ్వదు అనే చెప్పాలి. 

 

అయితే ఈ సాంగ్ కోసం సంగీత దర్శకుడు థమన్ ని, ఎడిటర్ ని, అలానే మరికొందరు ఇతర సౌండ్ అసిస్టెంట్లు, డ్యాన్సింగ్ టీమ్, పలువురు కాస్ట్యూమ్ డిజైనర్లు, మరికొందరు యూనిట్ సభ్యులు అందరూ కలిసి వెళ్లడంతో, వారికి ఖర్చులు బాగానే అయ్యాయని, వాటితో పాటు పాటను ఎక్కువరోజులు పాటు అక్కడే తీయవలసి వచ్చినందున మొత్తంగా ఆరుకోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. మరి కేవలం ఒక్క  పాట కోసమే అంత భారీగా ఖర్చు పెడితే, ఇక మొత్తం సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో అని పలువురు నెటిజన్లు ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: