కోలీవుడ్ నటుడు శివకుమార్ కుమారులైన సూర్య, కార్తీ ఇద్దరూ కూడా ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి పేరున్న నటులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూర్య, తెలుగులో గజినీ సినిమాతో ఇక్కడ మంచి పేరు, మార్కెట్ సంపాదించుకోగా, తన తొలి సినిమా యుగానికిఒక్కడు తో యావరేజ్ విజయాన్ని అందుకున్న కార్తీ, ఆ తరువాత ఆవారా సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. 

 

ఇక ఆ తరువాత కెరీర్ పరంగా అన్నదమ్ములిద్దరూ కూడా హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ని కూడా అందుకున్నప్పటికీ, కొన్నాళ్లుగా అన్న సూర్యతో పోలిస్తే తమ్ముడు కార్తీ మాత్రం ఒకింత పర్వాలేదనిపించేలా ముందుకుసాగుతున్నాడు. నిజానికి ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కార్తీ హీరోగా తెరకెక్కిన దేవ్ సినిమా వరకు కూడా కార్తీ వరుసగా ఫ్లాప్స్ అందుకున్నప్పటికీ, కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ సినిమా ఆయనకు కెరీర్ పరంగా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి బ్రేక్ ని అందించింది. ఇక మొన్న డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దొంగ సినిమా, కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ విమర్శల ప్రశంశలు అందుకుంది. 

 

అయితే ఈ సినిమా తమిళ్ లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది . అయితే అన్నయ్య సూర్య పరిస్థితి మాత్రం చాలా రోజులుగా ఫ్లాప్స్ దిశగానే పోతోంది. కొన్నాళ్ల నుండి సూర్య నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా పరాజయం పాలవుతున్నాయి. కెరీర్ పరంగా కొంత విభిన్నమైన సినిమాల్లో నటించే అలవాటున్న సూర్య, నటుడిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన నటించిన సినిమాలైన 24, సింగం 3, ఎన్జీకే, బందోబస్త్ సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు. కాగా ప్రస్తుతం లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సూర్య .మరి కెరీర్ పరంగా ఆయనకు ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: