పూరీ జగన్నాధ్ సినిమా ఇడియట్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘నువ్వు నన్ను కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు.. అదే నేను నిన్ను లాగి కొట్టాననుకో అదవద్ది మ్యాటర్’ అంటాడు. ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్ గురించి ఈ డైలాగ్ నే అన్వయించుకోవాలేమో. ఈ డైలాగ్ ఎవరి కోసమో కాదు.. మెగాస్టార్ చిరంజీవి - డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ కాంబో గురించే. వీరి కాంబినేషన్ గురించి మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుందంటే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడీ కాంబో సెట్ అయ్యిందనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

 

 

చిరంజీవి కబ్ బ్యాక్ మూవీగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలోనే రావాల్సింది. ఇందుకు ఆటోజానీ అనే కథ కూడా చిరంజీవికి చెప్పినట్టు అప్పట్లో పూరీనే చెప్పాడు. ఫస్టాఫ్ కథ నచ్చిన చిరంజీవికి సెకండాఫ్ కథ నచ్చకపోవడంతో వీరి కాంబోలో సినిమా రాలేదు. దీంతో చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమా చేశాడు. ప్రస్తుతం చిరంజీవి.. పూరి జగన్నాధ్ కు వేరే కమిట్ మెంట్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమా.. పూరి ‘ఫైటర్’ తో బిజీగా ఉండనున్నారు. ఆ తర్వాతే ఈ కాంబో గురించి విశేషాలు బయటకు వచ్చేలా ఉన్నాయి.

 

 

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు క్రేజ్ క్రియేట్ చేస్తాయి. నెంబర్ వన్ హీరోతో టాప్ మాస్ డైరక్టర్ సినిమా చేస్తే అంచనాలకు ఆకాశమే హద్దు. ఇండస్ట్రీలో అలాంటి హిట్ కాంబినేషన్లకు కొదవ లేదు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఓ స్టార్ డైరక్టర్ కి వస్తేనే అంచనాలకు అంతు ఉండదు. ఈసారైనా ఈ కాంబినేషన్ పట్టాలెక్కాలని ఇండస్ట్రీకి ఓ భారీ బ్లాక్ బస్టర్ రావాలని కోరుకోవడం అతిశయోక్తి కాదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: