తెలుగు సినిమాల్లో కొత్త కొత్త కాన్సెప్టులు రాజ్యమేలుతున్న సమయమిది. ఏ చిన్న పాయింట్ ఇంటరెస్టింగ్ గా ఉన్నా ఆ దర్శకుడికి లక్కీ చాన్స్ దక్కినట్టే. అయితే.. కొత్త వారు కాబట్టి కొత్త కొత్త కాన్సెప్ట్స్ గురించి తమ బుర్రకు పదును పెట్టాల్సిందే. అదే సీనియర్ డైరక్టర్లైతే తమ అనుభవంతో కొత్త కథలు రాయగలరు. వెరైటీ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే డైరక్టర్లలో అల్లరి రవిబాబు కూడా ముందు వరుసలో ఉంటాడు.

 

 

దర్శకుడిగా అల్లరి సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం హిట్, ఫ్లాపులకు అతీతంగా కొనసాగుతోంది. ఎన్నో వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు తీసిన దర్శకుడిగా రవిబాబుకు పేరు ఉంది. ప్రస్తుతం ఓ వైరైటీ కాన్సెప్ట్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ‘క్రష్’ అనే టైటిల్ తో ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పటివరకూ ప్రేమ సినిమాలు, సస్పెన్స్ ధ్రిల్లర్స్ మాత్రమే తీసిన రవిబాబు ఈసారి మోడ్రన్ అల్ట్రా కామెడీ జోనర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పోస్టర్ లో సముద్ర తీరంలో టూపీస్ బికినీలో ఉన్న అమ్మాయి.. ముగ్గురు కుర్రాళ్లు ఉన్న స్టిల్ చూస్తే యూత్ ను టార్గెట్ చేసుకుని దర్శకుడు ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

అల్లరి, సోగ్గాడు, అనసూయ, అవును, లడ్డూ బాబు, నువ్విలా, నచ్చావులే, పార్టీ, అమ్మాయిలు – అబ్బాయిలు, అదుగో, ఆవిరి.. వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు రవిబాబు. ఇటువంటి కాన్సెప్టులతో బాలీవుడ్ లో అనేక సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. తెలుగులో ఇటువంటి సినిమా రాలేదనే చెప్పాలి. మొత్తానికి బాలీవుడ్ తరహాలో అడల్ట్ కామెడీతో రవిబాబు మరోసారి అల్లరి చేస్తాడేమో చూడాలి. అప్పట్లో అల్లరి సినిమా కూడా ఇలాగే కొత్త కాన్సెప్ట్ తో వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: