సంక్రాంతి రేసు విన్నర్ కావాలని ప్రయత్నిస్తున్న మహేష్ బన్నీల పై 200 కోట్లకు పైగా బయ్యర్ల డబ్బు చిక్కుకోవడంతో వీరిద్దరి సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు నష్టాలు లేకుండా లాభ పడాలి అంటే ఈ రెండు సినిమాలకు సంబంధించి కనీసం 350 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వస్తే కాని ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ బయ్యర్లు గట్టెక్కలేరు. ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు సినిమాలకు సంబంధించి ఉన్న ప్లస్ లపై అదేవిధంగా మైనస్ లపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ఓవర్సీస్ ప్రేక్షకులలో ఉండే క్రేజ్ ను పరిగణలోకి తీసుకుంటే బన్నీ కంటే మహేష్ పై ఓవర్సీస్ ప్రేక్షకులలో మ్యానియా ఎక్కువ. అయితే తెలుగు రాష్ట్రాలలోని మాస్ ప్రేక్షకులలో మహేష్ కంటే బన్నీకి అభిమానులు ఎక్కువ. దీనికితోడు ఎప్పటి నుంచో బన్నీకి సాంప్రదాయంగా కొనసాగుతున్న మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎక్కువ. వాస్తవానికి ఈ మధ్య కాలంలో బన్నీకి మెగా ఫ్యాన్స్ కు మధ్య కొద్దిగా గ్యాప్ పెరిగినా మెగా ఫ్యాన్స్ బన్నీ సినిమా పై ఓపెన్ గా నెగిటివ్ ప్రచారం చేసి ఓపెన్ గా మహేష్ సినిమా పై పాజిటివ్ ప్రచారం చేయరు. అయితే వ్యూహాత్మకంగా బన్నీ సినిమా పై మౌనాన్ని కొనసాగిస్తారు.

ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన అనీల్ రావిపూడి త్రివిక్రమ్ ల ట్రాక్ రికార్డ్ ను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు తన కెరియర్ లో ఫెయిల్యూర్ అన్న పదాన్ని అనీల్ రావిపూడి చూడలేదు. అయితే త్రివిక్రమ్ గతంలో భయంకరమైన ఫ్లాపులు ఉండటంతో పాటు సంక్రాంతి త్రివిక్రమ్ కు అచ్చి రాదు అన్న నెగిటివ్ ప్రచారం కూడ ఉంది. అయితే సినిమాని తన స్క్రీన్ ప్లే తో అదేవిధంగా తన మాటల మాయతో ప్రేక్షకులను మెప్పించగల మాంత్రికుడు త్రివిక్రమ్. 

అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించి ఆడియో పరంగా తమన్ దేవిశ్రీ ప్రసాద్ పై తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా ‘సరిలేరు’ సినిమాకు సంబంధించి విజయశాంతి రీ ఎంట్రీ క్రేజ్ ప్లస్ కాబోతు ఉంటె’అల వైకుంఠ పురముకు’ ఖుష్బూ హుందా తనం ప్లస్ కాబోతోంది. ఇలా ఈ రెండు సినిమాలకు కొన్ని ప్లస్ లు మరికొన్ని మైనస్ లు ఉండటంతో ఈ సంక్రాతి రేస్ లో ఎవరు గెలుస్తారు అన్న విషయం పై క్లారిటీ లేకపోవడంతో చాల మంది బయ్యర్లు ఈ కొత్త సంవత్సరములో తమ జాతకం ఎలా ఉంది అంటూ తెలుసుకోవడానికి ప్రముఖ జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతున్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: