జబర్దస్త్ షో పుణ్యమంటూ హైపర్ ఆది తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు. అతడు ఆ షో లో చేసే కామెడీ స్కిట్లు చాలా మందిని కించపరిచేలా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతుంటారు. ఒక్క సారో లేదా రెండు సార్లో కాదు అన్ని జబర్దస్త్ స్కిట్ల ద్వారా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల ఆగ్రహానికి కారణమవుతాడు ఇతడు. ప్రజలు, నెటిజన్లు తిట్టిపోస్తున్న అతడి వ్యాఖ్యలకు మాత్రం బ్రేక్ పడదు. డిసెంబర్ 31స్ట్ రాత్రి ఈటీవీ లో ప్రసారమైన 'ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే' ప్రోగ్రామ్ లో హైపర్ ఆది గ్రామ వాలంటీర్ల పేరు ఎత్తాడు.

https://mobile.twitter.com/ManviDad/status/1212244484756393986


ఈ ప్రోగామ్ లో పాల్గొన్న కొంతమంది అమ్మాయిలను ఉద్దేశించి 'వీళ్లంతా గ్రామ వాలంటీర్లు' అని అంటాడు ఆది. అప్పుడు ఛీ, ఛీ, ఛీ అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. అలాగే రోజా తో సహా అందరూ పగలబడి నవ్వుతారు. తరువాత ఒక అమ్మాయి.. 'మేము గ్రామ వాలంటీర్లమే కానీ ఉప్పు, పప్పు లాంటివి సప్లై చేయం.. అందాన్ని మాత్రమే సప్లై చేస్తాం', అని అంటుంది.

https://mobile.twitter.com/SravanKoppala/status/1212245613267406848


అయితే ఈ సన్నివేశం గ్రామ వాలంటీర్లను కించపరిచేలా ఉండటంతో.. ఆది వాళ్లకు ఒక వీడియో ద్వారా క్షమాపణ చెప్పాడు. 'నాకు తెలిసిన గ్రామ వాలంటీర్లు.. వారి పేర్లను చెప్పమని నన్ను కోరితే ఆ పదం వాడటం జరిగింది. కానీ పక్కనున్న అమ్మాయికి ఆ పదం గురించి తెలియక తప్పుగా మాట్లాడింది. అమ్మాయి తరఫున గ్రామ వాలంటీర్ల అందరికీ సారీ. గ్రామ వాలంటీర్లు అంతా వాళ్ళ జాబ్ లను పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఆల్ ద బెస్ట్', అని చెప్పాడు.

https://mobile.twitter.com/YaggadiNaresh/status/1212284641979371520


ఈ వీడియోని చూసిన తరువాత... గ్రామ వాలంటీర్లు అంటే అంత చులకనగా ఉందా ఆది. వొళ్ళు దగ్గరపెట్టుకొని స్క్రిప్ట్ రాసుకో. ఎదుటివాళ్ళని అనేముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకో అని..., ఆది తన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. అసలు సంస్కారమే లేదని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: