అక్కినేని ఫ్యామిలీ అంటే నటనకు ప్రాధాన్యం ఇస్తారు అన్న విషయం .. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో అరుదైన అవార్డులను అందుకోవడమే కాదు.. సినిమాల్లో కూడా తన స్టయిల్లో ఆకట్టుకుంటూ వచ్చాడు.. ఇక ఈతరం విషయానికొస్తే .. నాగార్జున  కూడా అంతే ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.. అంతేకాకుండా టాలీవుడ్ మన్మధుడు గా పేరు సంపాదించాడు..

 

అదే విధంగా నాగ  చైతన్య కూడా అంతే .. వరుస సినిమాలలో నటిస్తూ మంచి విజయాల ను అందుకుంటూ ఇండస్ట్రీ లో మంచి మార్కెట్ ను సంపాదించుకు న్నాడు అలా ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తున్నాడు.. కానీ ఆ కుటుంబంలో ని మరో హీరో అఖిల్.. అఖిల్ సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఒక్క హిట్ సినిమాను కూడా ఖాతా లో వేసుకోలేదు..

 

మొన్న ఆ మధ్య వచ్చిన మజ్ను సినిమా ద్వారా ఓ మోస్తారు ఆకట్టుకుంది కానీ మంచి విజయాన్ని అందుకోలేదు.. తదుపరి చిత్రం లో నటించడానికి ఈ  రెడీ అయ్యాడు.. అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమాకోసం ఎందరో హీరోయిన్లను సంప్రదించారు.. 

 

కాగా, డీజే బ్యూటీ పూజహెడే హిరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.. పూజ లాంటి పెద్ద హిరోయిన్ ఎంటి అఖిల్ పక్కన నటించడం అని ఆలోచించకండి .. ఆమె ఎవరితో చేస్తే వారి సినిమా హిట్ అవ్వడం ఈ మధ్య జరుగుతుంది.. వీరిద్దికీ రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని అక్కినేని అభిమానులు అంటున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు..ఈ సినిమా పై భారీ అంచనాలే అఖిల్ పెట్టుకున్నాడు.. మరి చూడాలి ఈ మాత్రం హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: