ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులు తాము సమన్యాయం పాటిస్తాము అంటూ ప్రకటనలు ఇవ్వడంతో ఆమాట సాధారణ పదంగా మారిపోయింది. చిరంజీవి రాజక్రీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న నేపధ్యంలో ఇప్పుడు మెగా స్టార్ కూడ మహేష్ అల్లు అర్జున్ ల మధ్య సమన్యాయం పాటిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈనెల 6వ తారీఖున హైదరాబాద్ లో జరగబోతున్న ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా చేసే ఏర్పాట్లలో ఈఫంక్షన్ ను కూడ ఓపెన్ గ్రౌండ్ లో చేస్తూ భారీ ఈవెంట్ గా మార్చబోతున్నారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఈసినిమాలలో ఒక పాటకు స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. 

సాధారణంగా మన హీరోలు తమ సినిమా ఫంక్షన్స్ లో తమ పాటలకు సంబంధించి ఒకటి రెండు స్టెప్స్ స్టేజ్ పై లైవ్ గా వేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇలా ఒక పాటకు పూర్తిగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఈమధ్య కాలంలో జరగలేదు. దీనికితోడు ఆరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో ఈఫంక్షన్ జరగబోయే వేదిక పై త్రివిక్రమ్ తన సెంటిమెంట్ రీత్యా ఒక భారీ శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక కార్నర్ లో పెట్టి ఈఫంక్షన్ కు డివోషనల్ టచ్ కూడ ఇవ్వబోతున్నట్లు టాక్.

ఈపరిస్థితులు ఇలా ఉండగా చిరంజీవి అల్లు అర్జున్ అభిమానులకు ఏర్పడిన అసంతృప్తిని తీర్చే నిర్ణయం కూడ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన రెండురోజుల గ్యాప్ తో మరొక ఈవెంట్ ను విశాఖపట్నంలో కాని లేదంటే విజయవాడలో కాని చేసే ఆలోచనలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు టాక్. ఆంధ్రా ప్రాంతంలో జరగబోయే ఈ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్యఅతిధిగా వస్తూ తనకు బన్నీ మహేష్ ల రెండు సినిమాలు సమానమే అన్నసంకేతాలు ఇవ్వడమే కాకుండా ఈ రెండు సినిమాల ఘనవిజయం తాను కోరుకుంటున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పబోతున్నాడు అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: