టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి దాదాపు పదిహేనేళ్ల క్రితం సినిమా పరిశ్రమకు దూరమయ్యారు.  బీజేపీలో చేరిన ఆమె కొన్నాళ్లు ఆ పార్టీలో కొనసాగారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తల్లితెలంగాణ పార్టీ స్థాపించారు.  ఆ తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేసి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమంలో కొనసాగారు.  మెదక్ ఎంపీగా కూడా విజయశాంతి పనిచేశారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు వచ్చి పార్టీ వీడారు.  ప్రస్తుతం విజయశాంతి టీకాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.

 

ఇక రాజకీయాల్లో కొనసాగుతునపుడు విజయశాంతితో ఎంతో మంది దర్శక, నిర్మాతలు సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నించారు.  కానీ ఆమె మాత్రం ఏ సినిమాల్లో నటించలేదు.  చాలా కాలం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ లో నటిస్తున్నారు విజయశాంతి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె ఎన్నో విషయాలు మాట్లాడారు.  డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశానని, చాలా బాగా వచ్చిందని, ఈ మూవీ తనది ‘డిగ్నిఫైడ్ క్యారెక్టర్’ అని చెప్పారు. ఒక అందమైన సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి చేశారని, ఆయనకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు.

 

ఇదే సందర్భంగా ఆమె  1988లో వచ్చిన కొడుకుదిద్దిన కాపురం చిత్రం గురించి ఆమె ప్రస్తావించారు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేశ్ బాబు నటించాడని చెబుతూ.. అప్పుడు ఓ సన్నివేశం లో నటించడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను.  ఎందుకంటే మహేష్ బాబు చిన్నతనంలో చాలా ముద్దుగా ఉండేవాడు.. అతని చెంపపై కొట్టే సీన్లో నటించాలి.  మహేశ్ బాబు చెంపపై కొట్టేందుకు తనకు మనసు రాలేదని, దాంతో ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నేను అప్పుడే అనకున్న మహేష్ బాబు మరో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోతాడని.. నిజంగా ఇప్పుడు ఆ సూపర్ స్టార్ తోనే నటిస్తున్న చాలా సంతోషంగా ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: