పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతోందో స్పష్టమైన క్లారిటీ ఇప్పటి వరకు లేదు. ఈ సినిమాలో నటిస్తాను అని పవన్ అంగీకరించినా పవన్ డేట్స్ మాత్రం ఇంకా దిల్ రాజ్ కు ఇవ్వకపోవడంతో ఈ మూవీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో దిల్ రాజ్ కు కూడ తెలియని పరిస్థితి. 

ఇలాంటి పరిస్థితులలో నిన్న నూతన సంవత్సరం వేడుకల మధ్య ‘సత్యాగ్రహి’ అన్న టైటిల్ తో ఒక మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ టైటిల్ పేరు వినగానే ఈ టైటిల్ తో ఒక సినిమాను పవన్ నటించాలని భావించడం ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహిస్తాడు అంటూ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన వార్తలు గుర్తుకు వస్తాయి. 

పవన్ నటించే మూవీమూవీ ప్రారంభం అవ్వకపోయినా పవన్ అభిమానులలో మాత్రం ఈ మూవీ టైటిల్ బాగా రిజిస్టర్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా పేరుతో నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ పవన్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నలుగురు యువకులు చేతులు పైకెత్తి మేము సిద్ధం అన్నట్టుగా నిలుచున్నారు. 

బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ పిడికిలి బిగించి ఉన్న పెయింటింగ్ కూడ మసకగా కనిపిస్తుంది. దీనితో పవన్ ఆలోచనలతో ఈసినిమా ఉండబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  ఈ సినిమాకు ‘ఇన్ స్పైర్డ్ బై ట్రూ లీడర్’ అన్న ట్యాగ్ లైన్ ను దర్శకుడు కృష్ణ చైతన్య ఇచ్చాడు. దీనితో ఆ ట్రూ లీడర్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ పవన్ అభిమానులు నిన్నటిరోజున జోష్ లో న్యూఇయర్ ను గడిపేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ రిలీజ్ డేట్ ను సంక్రాంతి సినిమాల హడావిడి తరువాత ప్రకటిస్తారు అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: