టాలీవుడ్ లో కి వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ మూవీతో తొలిపరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా.  ఈ మూవీతో హీరోగా రామ్ పోతినేని పరిచయం అయ్యారు.  ఇద్దరు కొత్తగా పరిచయం అయినా.. తమ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  ఇక ఇలియానా తన నడుం వొంపులతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఈ గోవా బ్యూటీ అందాలకు ఫిదా అయిన స్టార్ హీరోల తమ పక్కన ఈ బ్యూటీనే కన్ఫామ్ చేయండి అనే పరిస్థితికి వచ్చారు.  దాంతో తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేసింది ఇలియానా.  స్టార్ హీరోయిన్ గా మంచి ఛాన్సులు దక్కించుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ ని ఏలేద్దాం అని బయలు దేరింది.  కానీ అక్కడ ఈ అమ్మడికి వరుస పరాజయాలతో సతమతమయ్యింది.  తిరిగి టాలీవుడ్ రావాలన్న ఇక్కడ ఛాన్సులు లేకుండా పోయాయి.  దాంతో కొంత కాలం మూవీస్ కి దూరంగా ఉంటూ ఫోటో షూట్స్ తో కాలం గడిపింది.

 

ఈ మధ్యన ఆమె వరస పెట్టి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇంతలోనే ప్రేమాయణం సాగించడం.. విడిపోవడం జరిగింది. సన్నగా మెరుపుతీగలా ఉన్న ఇలియానా బొద్దుగా తయారైంది. ఆ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘ అమర్ అక్బర్ ఆంథోని’ మూవీలో నటించింది. ఆమె శరీర సౌష్టవం పై అప్పుడు కొన్నివిమర్షలు కూడా వచ్చాయి.  దాంతో ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది ఇల్లీ బేబీ.  వయసు మీద పడొచ్చు కానీ..ఛార్మ్ మాత్రం ఏ మాత్రం మిస్ కాలేదన్న విషయాన్ని తన ఫోటోలతో చెప్పేసిందంటున్నారు. ఇటీవల కాలంలో ఇలియాన ఇన్ స్టా అకౌంట్ ను చూస్తే.. ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు చూస్తే కుర్రాళ్లకు పిచ్చేక్కించే విధంగా ఉంది.

 

కాకపోతే కొందరు మాత్రం అవి పాత ఫొటోలని, ఇప్పుడు ఇలియానా ని చూసిన వారు ఇట్టే గుర్తించేస్తారని అంటున్నారు.  అప్పట్లో ఆమె బయిట పెట్టకుండా దాచిన ఫొటోలను ఇప్పుడు తెలివిగా అప్ లోడ్ చేస్తోందిని చెప్తున్నారు. ఇలియానా ఇంకా చబ్బిగానే ఉందని..వయస్సు ముఖంలోనే కనపడిపోతోందని, నడుము కూడా అంతకు ముందు లా లేదని ,ఆంటీ లుక్ వచ్చేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడూ పూర్తిగా తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి నానా తంటాలు పడుతుంది ఇల్లీబేబి. 

మరింత సమాచారం తెలుసుకోండి: