బుల్లితెర మీద క్రేజీ జోడీ అంటే సుధీర్ రష్మి అని అందరికి తెలిసిందే. యూట్యూబ్ జోడీగా సుడిగాలి సుధీర్, రష్మిలకు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ లో సత్తా చాటి ఢీ, పోరాపోవే షోలు చేస్తూ తన టాలెంట్ చూపిస్తున్న సుధీర్ రీసెంట్ గా హీరోగా కూడా సినిమా చేశాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ సుధీర్ హీరోగా చేసినా మొదటి ప్రయత్నం సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది.

 

ఇక ఇదిలాఉంటే సుధీర్ రష్మి జోడీ లానే బుల్లితెర మీద మరో క్రేజీ ప్రేమ జంట ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ లో తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కంటెస్టంట్ గా వచ్చి టీం లీడర్ గా మారి తెలుగు రెండు రాష్ట్రాల్లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హైపర్ ఆదికి ఒక జోడీ కుదిరింది. ఆమె ఎవరో కాదు వర్షిణి.

 

లేటెస్ట్ గా వస్తున్న ఢీ ఛాంపియన్స్ లో రవి ఎగ్జిట్ అవడంతో అతని బదులుగా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఆదికి జతగా వర్షిని కో యాంకర్ గా ఉంటుంది. అయితే సుధీర్ రష్మిల జోడీలానే తమ జోడీ కూడా ఫేమస్ అవ్వాలని వర్షినితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు ఆది. ఇది ఎవరో అన్న మాట కాదు స్వయంగా రీసెంట్ గా ఢీ షోలో ఆది వర్షిణి కన్ ఫాం చేశారు.

 

అల వైకుంఠపురములో సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ సామజవరగమనతో ఆది, వర్షిణి రొమాంటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా వర్షిణితో తన లవ్ ట్రాక్ బయటపెట్టాడు ఆది. సో ఇక మీదట సుధీర్, రష్మిలకు పోటీగా ఆది వర్షిణి జంట అలరించనుంది. రష్మి వెంట సుధీర్.. వర్షిణి వెంట ఆది ఇలా బుల్లితెర మీద క్రేజీ కపుల్స్ షోని సక్సెస్ చేసేందుకు కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: