జనవరి 1వ తారీఖున ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ లుక్ కాని లేదంటే ఆ సినిమాకు సంబంధించిన ఏదైనా ఒక లేటెస్ట్ అప్ డేట్ వస్తుందని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే రాజమౌళి మాత్రం నిన్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పేరుతో ఒక పోష్టర్ ను విడుదల చేసి ఆ పోష్టర్ పై జూలై 30న విడుదల అన్నపదం లేకుండా జాగ్రత్తపడి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ తెలివిగా షాక్ ఇచ్చాడు.

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల వాయిదా పడినట్లే అన్న స్పష్టమైన సంకేతాలు జూనియర్ చరణ్ అభిమానులకు అందడంతో నిన్న న్యూఇయర్ రోజున వారంతా నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వాయిదా పడుతుంది అంటూ అనేక లీకులు వచ్చాయి.

దీనికితోడు ఈసినిమాకు సంబంధించి క్లైమాక్స్ విషయంలో కూడ రాజమౌళికి కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. బయటకు ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయింది అని లీకులు ఇస్తున్నా వాస్తవానికి ఈసినిమా షూటింగ్ కేవలం సగం మాత్రమే పూర్తి అయింది అని అంటున్నారు. 

దీనికితోడు ఈ మూవీ నిర్మాత దానయ్యకు విపరీతంగా ఈ సినిమాకు సంబంధించి బయ్యర్ల నుండి ఆఫర్లు వస్తున్నా వాటిని అంగీకరించకుండా హోల్డ్ లో పెట్టమని రాజమౌళి దానయ్యకు స్పష్టమైన సూచనలు ఇచ్చాడు అంటూ ఇప్పటికే లీకులు ఉన్నాయి. ఇప్పుడు నిన్న విడుదలైన ఈ మూవీ లేటెస్ట్ పోష్టర్ లో ఈ మూవీ రిలీజ్ డేట్ మిస్ కావడంతో ఈ మూవీ వాయిదా పడటం ఖాయం అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ విడుదల కుదిరితే ఈ ఏడాది దసరాకు లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో జూనియర్ చరణ్ లు ఈ సంవత్సరం కూడ పూర్తిగా రాజమౌళి బందిఖానాలో బందీలుగా ఉండవలసిందే అంటూ జోక్స్ వేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: