గత ఏడాది ముగించుకొని తాజాగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాబోతున్న స్టార్ హీరోల సినిమాల గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు సోషల్ మీడియాలో సీరియస్ గా చర్చలు జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు చాలామంది సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. దీనిలో భాగంగా సంక్రాంతి వచ్చే సినిమాలను పక్కన పెడితే రాబోయే సినిమాల్లో టాప్ టెన్ ఒకసారి గమనిస్తే..మొట్ట మొదటి స్థానంలో దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న rrr సినిమా ఉంది. రెండో ప్లేస్ లో కేజిఎఫ్ పార్ట్ 2 ఉంటుంది. మూడో స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న జాన్ సినిమా ఉంది. నాలుగో స్థానం లో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఉంది. ఐదవ స్థానంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తమిళ్ సినిమా అసురన్ రీమేక్ ఉంది.

 

ఆరో సినిమా బాలయ్య మరియు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా ఉంది.  ఇక ఏడవ స్థానంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా ఉంది. 8వ స్థానంలో నాగ చైతన్య నటిస్తున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా ఉంది. 9వ స్థానంలో నాని నటిస్తున్న v సినిమా ఉంది. పదవ స్థానంలో రవితేజ నటించిన క్రాక్ సినిమా ఉంది. 11వ స్థానంలో రామ్ నటిస్తున్న రెడ్ సినిమా ఉంది. ఈ సినిమాలో ఈ ఏడాది రాబోతున్న విడుదల కాబోతున్న అతిపెద్ద ప్రాజెక్టు సినిమాలు అని సోషల్ మీడియాలో తెలుగు సినిమా ప్రేక్షకులు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 

ఇవే కాకుండా అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు కూడా ఈ ఏడాది హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలు అన్ని ఓవరాల్ గా సూపర్ డూపర్ విజయాలు అయితే గనుక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సంవత్సరం కాసుల పంట పండినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: