టాలీవుడ్ స్టార్ హీరోలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ప్రతి సంవత్సరం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. నాగచైతన్య - సమంత, రామ్ చరణ్ - ఉపాసన గోవా బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొందరు స్టార్ హీరోలు కొత్త సంవత్సరం వేడుకలను విదేశాల్లో చేసుకోగా మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చేసుకున్నారు. మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకున్నాడు అనే ప్రశ్నకు అల్లు అర్జున్ బ్యాంకాక్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాడనే సమాధానం వినిపిస్తోంది. 
 
బ్యాంకాక్ లో అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహారెడ్డితో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకున్నాడు. ఈ వేడుకలలో బన్నీ వైట్ షార్ట్ టీ షర్ట్ తో కనిపించగా అతని వైఫ్ స్నేహారెడ్డి మాత్రం షైనీ పార్టీ గౌన్ లో మెరిసిపోయింది. అల్లు అర్జున్ - స్నేహ దంపతుల పిల్లలు అయాన్, అర్హా ఈ వేడుకలకు వెళ్లారో లేదో తెలియట్లేదు. సోషల్ మీడియాలో బన్నీ న్యూ ఇయర్ పార్టీకి సంబంధిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
బన్నీ ఏ పార్టీ చేసుకున్నా ఆ పార్టీకి సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో రివీల్ అవుతాయి. బన్నీ భార్య స్నేహకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించినా రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. 
 
ఇప్పటికే విడుదలైన అల వైకుంఠపురములో టీజర్, పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే అల వైకుంఠపురములో బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: