మా అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ మా డైరీ ఆవిష్కరణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఆసోసియేషన్ వలన నా ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయని అన్నారు. అందుకే నాకు కారు ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇండస్ట్రీలో నిప్పు రాజుకుంటుందని రాజశేఖర్ అన్నారు. కప్పి పెడితే నిప్పు దాగదని రాజశేఖర్ అన్నారు. 
 
ఇండస్ట్రీలో తమను తొక్కేస్తున్నారంటూ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని నిందలొచ్చినా పరవాలేదని తాను ఎప్పుడూ నిజమేచెబుతానని రాజశేఖర్ అన్నారు. వేదికపైనే రాజశేఖర్ పెద్దలందరి కాళ్లు మొక్కారు. మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రోటోకాల్ పాటించని వ్యక్తుల గురించి ఏం మాట్లాడలేను అని చిరంజీవి అన్నారు. నా మాటకు విలువే ఇవ్వలేదని మంచి ఉంటే మైకులో చెప్పండని చెడు ఉంటే చెవిలో చెప్పండని చిరంజీవి అన్నారు. 
 
పథకం ప్రకారమే రసాభాస సృష్టించడానికి రాజశేఖర్ యత్నించారని చిరంజీవి అన్నారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే అని చిరంజీవి అన్నారు. కావాలనే ఇలా చేస్తున్నారని చిరంజీవి అన్నారు. చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ పదేపదే అడ్డుపడ్డారు. ఆ తరువాత సినీ నటుడు రాజశేఖర్ వేదిక దిగి వెళ్లిపోయారు. మోహన్ బాబు, చిరంజీవి రాజశేఖర్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను చెప్పే మాటలను వినకుండా మైకు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని చిరంజీవి ప్రశ్నించారు. 
 
మా డైరీ ఆవిష్కరణకు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ హాజరయ్యారు. చిరంజీవి ప్రసంగిస్తున్న సమయంలో రాజశేఖర్ పదే పదే అడ్డుపడటంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి వివాదాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువును మసకబారుస్తున్నాయి. తమలో తామే గొడవలు పడుతూ కొందరు నటులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: