కొత్త ఏడాదిని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు సరికొత్తగా ఆహ్వానించారు. చాలామంది సెలబ్రేషన్ లో మునిగి తేలిపోయారు. బ్యాచిలర్ గా ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలు రచ్చ రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి తరుణంలో నా పేరు సూర్య తో 2018వ సంవత్సరంలో దారుణమైన పరాజయాన్ని చూసిన అల్లు అర్జున్ 2019 సంవత్సరంలో ఎటువంటి సినిమాని విడుదల చేయకుండా 'అలా వైకుంఠపురం లో' సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. కొత్త ఏడాదిలో మాత్రం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తో పాటు సుకుమార్ సినిమా ను కూడా విడుదల చేయాలని ఈ ఏడాది నుండి వరస ప్రాజెక్టులతో బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు అల్లు అర్జున్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం.

 

ఇటువంటి తరుణంలో కొత్త సంవత్సరం వేడుకలను భార్య స్నేహారెడ్డితో కలిసి బ్యాంకాక్ లో అద్భుత రీతిలో బ్యాంగ్ బ్యాంగ్ అన్నట్టుగా బాగా ఎంజాయ్ చేసి ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు వెస్ట్రన్ కల్చర్ తరహాలో బట్టలు వేసుకుని ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బన్నీ బ్లూ కలర్ టీషర్ట్, వైట్ కలర్ షార్ట్స్‌లో ఉన్నారు. ఇక స్నేహారెడ్డి జిగేల్‌మనే పొట్టి గౌనులో మెరిశారు.

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠ పురంబులో' సినిమా కాబోయే సంక్రాంతికి జనవరి 12వ తారీకున విడుదల చేయాలని ముందు భావించిన ఇప్పుడు మాత్రం జనవరి 10 వ తారీఖున విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో 'అలా వైకుంఠపురం లో' సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: