బాలీవుడ్ క్రేజీ లవ్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే పెళ్ళి తర్వాత కూడా వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఓ పక్క హీరోగా రణ్ వీర్ వరుస సక్సెస్ లు కొడుతుంటే.. హీరోయిన్ గా దీపికా పదుకునే కూడా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ అలరిస్తుంది. బాలీవుడ్ లో ఈ జంటకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దీపిక అంటే చాలా ఇష్టం ఉన్న రణ్ వీర్ కేవలం షూటింగ్ టైం లో తప్ప మిగిలిన టైం అంతా ఆమెతోనే గడుపుతాడట.

 

ఈ క్రేజీ కపుల్స్ ఇప్పుడు తమ బెడ్ రూం విషయాలను కూడా బయట పెట్టేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్ లో కార్తిక్ ఆర్యన్ అడిగిన చిలిపి ప్రశ్నకు అంతే చిలిపిగా సమాధానం ఇచ్చారు రణ్ వీర్, దీపికా. మీరు రోజు ఏ వైపు నుండి మంచం దిగుతారు అని దీపికాను అడిగాడు కార్తిక్ ఆర్యన్.. అయితే ఆమె దానికి దీపికా సిగ్గుపడుతూ కుడి వైపు నుండి అని చెప్పింది. అయితే వెంటనే మైకు అందుకున్న రణ్ వీర్ అవును దీపికా కుడి వైపు నుండే మంచం దిగుతుంది ఎందుకంటే ఎడమ వైపు నేనుంటా కాబట్టి అంత త్వరగా మంచం దిగనివ్వనని అన్నాడు.  

    

రణ్ వీర్ మాట్లాడిన తీరు చూసి దీపికా ఒక్కసారి షాక్ అయ్యింది. రణ్ వీర్, దీపికా అన్యోన్యత చూసి వారి ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరు సినిమాల విషయంలో కాంప్రమైజ్ అవడం లేదు. రణ్ వీర్ సింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ అలరిస్తుండగా దీపికా మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంది.  ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ బయోపిక్ 83 మూవీ చేస్తున్నాడు. దీపికా చపాక్ సినిమాలో నటిస్తుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: