మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గత కొంత కాలంగా వివాదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత అయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాలు సద్దుమణిగి పోతాయని అనుకున్నారు కానీ... కొత్త అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికైన తర్వాత కూడా మా వివాదాలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా అయితే తారాస్థాయికి చేరి పోయాయి మా అసోసియేషన్ వివాదాలు. ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి. నేడు పార్క్ హయత్ హోటల్ వేదికగా మా నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుబ్బిరామిరెడ్డి చిరంజీవి జయసుధ మోహన్ బాబు రాజశేఖర్ పరుచూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. 

 

 

 అయితే ఈ సమావేశంలో మాట్లాడిన చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను  కాన్స్ట్రుక్టీవ్  గా సాగిపోయేలా చూడాలని ఏదైనా మంచి ఉంటే పెద్దగా అరుస్తూ చెప్పాలని గొడవలు వచ్చినప్పుడు కేవలం చెవిలో  మాత్రమే చెప్పుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మూలధన నిధి పెరుగుతున్నకొద్దీ గొడవలు కూడా పెరుగుతున్నాయని చిరంజీవి అన్నారు. తామంతా ఒక్కటే కుటుంబమంటూ ఎలాంటి గొడవలు లేకుండా కలిసి మెలిసి ఉండాలి అంటూ చిరంజీవి సూచించారు. ఇక ఆ తర్వాత స్టేజి మీదనే ఉన్న హీరో రాజశేఖర్ మైక్ లాక్కొని మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పుని ఎంతలా దాచాలని ప్రయత్నించినా పొగ రాకుండా మానదు అని రాజశేఖర్ వ్యాఖ్యానించడంతో వేదికపై రభస  నెలకొంది. రాజశేఖర్ నివారించే ప్రయత్నం చిరంజీవి చేసినప్పటికీ రాజశేఖర్ మరింత అగ్రెసివ్ గా మాట్లాడారు. 

 

 

 మీరు మాట్లాడేటప్పుడు నేను కల్పించుకోలేదని నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు  కల్పించుకోకండి అంటూ  చిరంజీవిపై కాస్తంత ఘాటుగానే విమర్శలు చేశాడు రాజశేఖర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో  18 మంది ఓవైపు ఎనిమిది మంది ఓ వైపు ఉన్నారని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జయసుధ స్టేజ్ పైకి వచ్చి రాజశేఖర్ చేతులోని మైక్ ను  తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ రాజశేఖర్ మాత్రం మైక్ ఇవ్వకుండా  మాట్లాడుతూనే ఉన్నారు . అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏది ప్రాంక్ గా  జరగలేదని తాను సత్యంగా  బతకాలి అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కలకలం రేపుతోంది. ఆ తర్వాత స్టేజ్ దిగి  రాజశేఖర్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత మైకు అందుకున్న చిరంజీవి తన మాటకు కాస్తయినా గౌరవం ఇవ్వలేదని ఇక్కడ పెద్దలం ఉండి  ఇంకెందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాలో  మరోసారి విభేదాలు  బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: