మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గత కొంతకాలంగా రగులుతున్న వివాదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరి పోయాయి. నేడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ వేదికగా జరగ్గా..  చిరంజీవి జయసుధ మోహన్ బాబు రాజశేఖర్ పరుచూరి వెంకటేశ్వరరావు టి.సుబ్బిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన అనంతరం హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. చిరంజీవి గారు మంచి ఉంటే బయటకు చెప్పుమని చెడు ఉంటే చెవిలో చెప్పాలి అని అన్నారు ... మంట పెడితే పొగ రాకుండా ఎలా ఉంటుంది అంటూ చిరంజీవి వ్యాఖ్యలపై రాజశేఖర్ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమి డిస్ట్రబ్ చేయలేదు అని నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు డిస్టర్బ్ చేయకండి అంటూ ఘాటుగా చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు రాజశేఖర్. 

 

 

 

నేను చెప్పేది వినండి మీరు అరిస్తే ఏది జరిగిపోదు అంటూ రాజశేఖర్ వ్యాఖ్యానించారు. మీ అందరి వల్ల నాకు ఆక్సిడెంట్ అయిందని రాజశేఖర్ అన్నారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో రాజశేఖర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్ పెద్దగా ఉన్న చిరంజీవి మీద ఇలాంటి విమర్శలు కానీ వ్యాఖ్యలు ఎనీ చేసింది లేదు మొదటిసారి రాజశేఖర్  చిరంజీవి వ్యాఖ్యలపై మండిపడ్డడంతో ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. అయితే తన ప్రసంగం అనంతరం స్టేజి దిగి రాజశేఖర్ వెళ్లిపోయారు. అయితే అనంతరం డైరీ ఆవిష్కరణలో జరిగిన గొడవ పై మాట్లాడిన జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 మా అసోసియేషన్లో గొడవలు జరిగినప్పుడు మా కంటే ముందు మీడియాకే తెలుస్తుందని ఇందులో దాచాల్సిందే ఏదీ లేదంటూ ఆమె తెలిపారు. ప్రతి చోట గొడవలు ఉంటాయని మేము  కూడా మనుషులమే అని ఆమె వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఎన్నో రాస్తున్నారని మేము కట్టేసిన కుక్కలమో  బర్రెలమో కాదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మాపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయకండి...  కావాలంటే మా సినిమాలపై మీరు కామెంట్ చేయొచ్చు అంటూ ఆమె తెలిపారు. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ మనసులో ఏముందో అది చెప్పడం తప్ప ఆయన మాటల  వెనుక ఉద్దేశం ఏమీ లేదు అంటూ జీవిత-రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కరించుకోవాలి అందుకే రాజశేఖర్ కాస్త అగ్రెస్సివ్ గా  మాట్లాడారు అని తెలిపారు జీవిత . మా అధ్యక్షుడు నరేష్ కి కూడా నేను ఇదే చెబుతున్నాను . అందరితో కలిసి మేము పనిచేస్తామని... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని చిరంజీవి గారు ముందుండి నడిపించాలని  జీవిత అన్నారు. రాజశేఖర్ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని అంటూ జీవిత తెలిపారు,

మరింత సమాచారం తెలుసుకోండి: