ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాదికి కూడా ఘన స్వాగతం పలికారు టాలీవుడ్ ప్రముఖులు. అందులో భాగంగా  కొందరు హీరోలు ఇక్కడే న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోగా మరి కొంత మంది  వేరే దేశాలకు వెళ్లి  సెలబ్రేట్ చేసుకున్నారు.  వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 
 
అల్లు అర్జున్ :
 
అల ..  వైకుంఠపురములో షూటింగ్  పూర్తవ్వగానే  బన్నీ బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాడు.  అక్కడే న్యూ ఇయర్  ను తన  భార్య స్నేహా , పిల్లలతో  కలిసి  గ్రాండ్  గా సెలబ్రేట్ చేసుకున్నాడు.  ఈ సందర్భంగా   తన సతీమణి స్నేహ తో కలసి దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఇక  గత ఏడాది  అల్లు అర్జున్ , నాపేరు  సూర్యతో ప్రేక్షకులముందుకు రాగా ఆ చిత్రం  బన్నీ కి షాక్ ఇచ్చింది. దాంతో  అల.. వైకుంఠపురములో తో హిట్ కొట్టి ఈ ఏడాది ని గ్రాండ్ ఆరంభించాలని బన్నీ ఎదురు చూస్తున్నాడు.  సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. 
 
విజయ్ దేవరకొండ : 
 
సెన్సేషనల్ హీరో విజయ్  దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి  దుబాయ్ లో న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన తమ్ముడి తో  దిగిన ఫోటో సోషల్ మీడియా లో  వైరల్ అయ్యింది.  ఇక  విజయ్ కి గత ఏడాది ఏ మాత్రం  కలిసి రాలేదు. ఆయన నటించిన  డియర్ కామ్రేడ్  భారీ షాక్ ఇచ్చింది. దాంతో ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ పైనే  ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది  ఫిబ్రవరి 14న విడుదలకానుంది. 
 
సుధీర్ బాబు : 
 
ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా  తన  సతీమణి  అలాగే కుటుంభ సభ్యులతో  కలిసి  న్యూ ఇయర్ ను గ్రాండ్  గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈసందర్భంగా   దిగిన ఫొటోలను సుధీర్ బాబు సోషల్ మీడియా లో  పోస్ట్ చేశాడు. ప్రస్తుతంఆయన,  వి అనే చిత్రం లో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని మరో హీరోగా నటిస్తుండగా  ఈఉగాది కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: