చిరంజీవి కొర‌టాల కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. అందులో చిరంజీవి దేవాదాయ శాఖలో జ‌రిగే అవినీతిని అరిట్టే  క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్‌గా త్రిష‌ని ఫైన‌ల్ చేయ‌గా త్వ‌ర‌లోనే మిగ‌తా కాస్ట్ అండ్ క్రూ గురించి స‌మాచారం ఇవ్వ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి చిరు లుక్ టెస్ట్ కూడా కొరటాల పూర్తి చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. చిరు కూడా కొరటాల శివ సినిమా కోసం బాగా బరువు తగ్గి కాస్త యూత్ లా కనబడుతున్నాడు. ఇకపోతే త్రిష హీరోయిన్ గా నటించబోయే సినిమాలో రెజినా ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక రెజినా చిరు సినిమాలో ఐటెం లో ఫిక్స్ అనే అన్నారు.


కానీ తాజాగా రెజీనాని చిరు సినిమా కోసం కొరటాల టీం సంప్రదించ‌గా... అయితే రెజినా ఆలోచించి చెబుతానని చెప్పినట్లుగా స‌మాచారం. కానీ ఇప్పుడు రెజినా చిరు సినిమాలో నటించడం లేదని.. ప్రస్తుతం హీరోయిన్స్ ఆఫర్స్, కాస్త నెగెటివ్ పాత్రలు తగులుతున్నాయని, విభిన్న కథలతో పాత్రలతో గుర్తింపు కోసం చూస్తున్న టైం లో ఐటెం గర్ల్ అవతారమెత్తితే తర్వాత హీరోయిన్ గా ఛాన్సెస్ మిస్ కావొచ్చని అందుకే చిరు సినిమాకి రెజినా నో చెప్పిందని టాక్ మొదల‌యింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే అలా ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించిన హీరోయిన్లు ఎంతో మంది త‌ర్వాత హీరోయిగా చేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. పైగా చిరు సినిమాలో అవ‌కాశాన్ని రెజీనా వ‌ద్ద‌నుకోవ‌డం కూడా ఒక‌ర‌కంగా ఆమెకే న‌ష్ట‌మ‌ని కొంద‌రు భావిస్తున్నారు. అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని ఎందుకు వ‌దులుకుందా అని చాలా మంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: