రెండేళ్ల పాటు సుమారు 900 మంది ఆర్టిస్టుల బాగోగులు చూసుకునేలా సిని పెద్దలు ఏర్పరచిన సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్. పేద కళాకారులకు అండగా ఉండేలా 'మా' పనిచేస్తుంది. 'మా' సభ్యులకు అవకాశాలు వచ్చేలా చేయడం.. వారి ఆర్ధిక అవసరాలను గుర్తించడం.. పేద కళాకారులకు కావాల్సిన నిత్య సౌకర్యాలను అందించడం లాంటివి ఈ అసోషియేషన్ చేస్తుంది.  

 

శివాజి రాజా వర్సెస్ నరేష్ ప్యానెల్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగగా.. ఫైనల్ గా నరేష్ 'మా' అధ్యక్షుడిగా గెలిచాడు. అయితే నరేష్ గెలవడంతోనే శివాజి రాజా అసంతృప్తి వెళ్లగక్కడం.. మీడియా ముందుకొచ్చి మాట్లాడటం 'మా' లుకలుకలు తెలిసేలా చేసింది. శివాజి రాజా నరేష్ ల మధ్య సంధి కుదిరింది కదా అనుకోగా కొత్తగా రాజశేఖర్ మాలో గొడవలకు కారణమవుతున్నాడు.

 

'మా' లో ఏదో జరుగుతుందంటూ రాజశేఖర్ సింగిల్ టోన్ వినపడుతుంది. అయితే అతనితో పాటుగా అధ్యక్షుడు నరేష్, జీవితను కూర్చోబెట్టి సిని పెద్దలు మాట్లాడారు. కాని ఈరోజు జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణలో కూడా రాజశేఖర్ 'మా' గొడవల గురించి ప్రస్థావించాడు. ఎలాంటి సందర్భం వచ్చినా సరే కూల్ గా మాట్లాడే చిరంజీవి సైతం రాజశేఖర్ మీద ఫైర్ అవడం జరిగింది.  

 

ఫైనల్ గా రాజశేఖర్ ఇంతగా గొంతెత్తి అరవడానికి కారణం ఏంటి..? నిజంగానే మాలో ఏదైనా జరుగుతుందా..? మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో అసలు ఈ గొడవలకు కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. నివురుగప్పిన నిప్పులా కనబడుతున్న ఈ ఇష్యూపై సిని పరిశ్రమ అంతా ఒకవైపు రాజశేఖర్ ఒక్కడే ఒకవైపు ఉన్నట్టుగా పరిస్థ్తులు కనబడుతున్నాయి. 'మా' విషయంలో రాజశేఖర్ హీరోనా.. విలనా అన్నది విషయం పూర్తిగా బయటకు వస్తేనే తెలుస్తుంది. అయితే ఈరోజు జరిగిన గొడవ వల్ల రాజశేఖర్ జీవిత రాజశేఖర్ లు మాకు రాజీనామా చేస్తారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: