కాలం గడిచిపోతుంది మనుషులతో తనకేమి సంబంధం లేనట్లుగా. రోజులు దొర్లి పోతుంటాయి నీతో పని నా కేంటని. ఇలాంటి సమయంలో కాలం చేసిన గాయాలు అంత త్వరగా మానిపోవు. అందులో మంచి కోరే మనుషులు గాని, మంచికోసం బ్రతికే మనుషులు గాని దూరమైతే ఆ బాధ వర్ణానితం. కాని కాలానికి ఏం తెలుసు మంచి మనుషులు దూరమైతే ఈ లోకంలో వ్యక్తులు పడే వేదన. దానికి తెలిసిందల్ల ఒక్కటే తనపని తాను చేసుకుంటు వెళ్లడం. ఈ కన్నీళ్లు, కష్టాలు అనే బాధలు తనకు అక్కర్లేదు.

 

 

ఇకపోతే కాల గర్భంలో కలిసిపోయిన ఎందరో మహానుభావుల్లో దాసరి గారు, రామానాయుడు గారు చిరకాలం గుర్తుంచుకో తగ్గ వ్యక్తులు.. సినిమా పరిశ్రమకు రెండు కళ్లలా ఉన్న వీరిని గత కొన్ని సంవత్సరాల క్రితం విధి మనకు దూరం చేసింది. వీరు భౌతికంగా దూరమైనా… వారి చిత్రాల ద్వారా మన మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే వుంటారు. ఇకపోతే కొత్త సంవత్సరం రోజున రామానాయుడు గారు ఏం చేసే వారంటే ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి స్టూడియోస్ కు వచ్చిన ప్రతి వారికీ వంద రూపాయల నోటు ఇచ్చేవారు. నాయుడుగారి దగ్గర నుంచి ఆ వంద నోటును తీసుకోడానికే చాలామంది వచ్చేవారు. అది చాలామందికి నూతన సంవత్సరం రోజున సెంటిమెంట్.

 

 

అంతే కాదు ఆ నోటును చాలామంది అపురూపంగా దాచుకునేవారు. ఇక  రామానాయుడుగారు చనిపోయిన తరువాత ఆ స్టూడియో వైపు  చాలామంది వెళ్లడం లేదు. నాయుడు గారు లేక స్టూడియోలోని ఆయన ఆఫీస్ చాలా కాంతిహీనంగా కనిపిస్తుందని ఆయన సన్నిహితులు బాధపడుతున్నారు. ఇకపోతే దాసరి నారాయణ రావు గారు కూడా నూతన సంవత్సరం రోజున కలసి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి వారికీ ఆయన నూట ఒక్క రూపాయి ఇచ్చి ఆశీర్వదించేవారు.

 

 

కొత్త సంవత్సరం రోజున తన దగ్గరకు వచ్చిన అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు దాసరి నారాయణ రావుగారు, పద్మగారు భౌతికంగా దూరమైన తరువాత ఆ ఇంటి వైపు వెళ్లే వారే లేరు. ప్రస్తుతం ఆ ఇల్లు దాసరి గారి గతకాల స్మృతులు గుర్తుకు తెస్తూ వుంది... వీరిద్దరు లేని లోటు చాలా స్పష్టంగా తెలుస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: