బాలీవుడ్ నటుడు రాజకుమార్ రావు తన నెక్స్ట్ సినిమా 'లూడో' లో రెండు విభిన్న పాత్రలను పోషించనున్నారు. అయితే నిన్న అనగా నూతన సంవత్సర సందర్భంగా అతడు తన సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేశాడు. ఆది చూసిన నెటిజన్లు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు.


రాజ్ కుమార్ లేడీ గెట్ అప్ లో అచ్చం బాలీవుడ్ భామ ఆలియా భట్ లాగానే ఉన్నాడని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం అతడు కృతి సనాన్ లాగా ఉన్నాడని కామెంట్లు చేస్తారు. అయితే, రాజ్ కుమార్ రావు వాస్తవానికి ఎలా కనిపిస్తున్నదంటే.. కృతి సనాన్ ను, ఆలియా భట్ ను మిక్స్ చేస్తే అప్పుడు వచ్చేది రాజ్ కుమార్ లేడీ గెట్ అప్ అనేలా ఉన్నాడు.



లూడో సినిమాని అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కుమార్ కు మంచి యాక్టర్ గా బాలీవుడ్ లో పేరుంది. నిన్న విడుదలైన పోస్టర్ లో కూడా అతడు ఆకుపచ్చ గాగ్రా చోళీ వేసుకొని, తొడల వరకు ఉన్న సొగరముని తొడుక్కొని, రెడ్ లిప్ స్టిక్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే పోజ్ ఇచ్చి అందర్నీ కట్టపడేసాడు.


ఇకపోతే, లూడో సినిమాని అనురాగ్ బసు, ఇంకా రాజ్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సన షైక్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లూడో చిత్రాన్ని మినహాయించి ది వైట్ టైగర్ అనే నెట్ ఫ్లిక్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు రాజ్ కుమార్. ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా కూడా నటిస్తుంది. లూడో సినిమాలో ఛాలెంజింగ్ పాత్రలలో రాజ్ కుమార్ నటిస్తున్నందున ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 

 

https://www.instagram.com/p/B6xfCqgps8U/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: