సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ మొదలైనట్టే.. సంక్రాంతి పండుగ శోభతో పాటుగా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ పండుగ మరింత కలర్ ఫుల్ గా మారుతుంది. ఇక ఈ సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 11న మహేష్.. 12న బన్ని.. 14న కళ్యాణ్ రాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

 

ఇక ఈ మూడు సినిమాల రన్ టైం న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా 2 గంటల 48 నిమిషాల రన్ టైంతో వస్తుందట. అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఫస్ట్ హాఫ్ కమెడీతో సెకండ్ హాఫ్ ఇంటెన్స్ తో సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో 3 గంటల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే మహేష్ సినిమా 2 గంటల 48 నిమిషాల డ్యురేషన్ ఫిక్స్ చేశారు.

 

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా 2 గంటల 36 నిమిషాల రన్ టైంతో వస్తుందని తెలుస్తుంది. త్రివిక్రం మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆల్రెడీ థమన్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా సినిమా మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే రెండున్నర గంటల సినిమా అయినా ఆడియెన్స్ అలరించే కంటెంట్ ఉంటే మెచ్చినట్టే.

 

ఇక ఈ సంక్రాంతికి స్టార్ సినిమాలకు పోటీగా వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా రెండు గంటల 22 నిమిషాల రన్ టైంతో వస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో మహేష్ సినిమా రన్ టైం ఎక్కువ కాగా తేడా కొడితే ఆ రన్ టైమే సినిమాను రిస్క్ లో పడేస్తుందని చెప్పొచ్చు. ఇక బన్ని సినిమా యావరేజ్ రన్ టైం తో వస్తుండగా కళ్యాణ్ రాం సినిమాకు రన్ టైం ప్లస్ అయ్యేలా ఉంది. ఇక వీటితో పాటుగా సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: