సాధారణంగా ఎన్నికలు అంటే ఏ రాష్ట్రంలో అయిన ఎంతో సందడి ఉంటుంది.  ఎప్పటి నుంచి పార్టీలు ఎన్నికల కోసం ఎదురు చూడటం.. ఆ సమయంలో తమ ప్రతాపాన్ని డబ్బు, మద్యం.. ఇతర వస్తు రూపంలో చూపించి ఓటర్లను లోబర్చుకునే యత్నాలు చేస్తుంటారు.  ఇక ఎన్నికల ప్రచారాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అయితే ఎన్నికలు అన్న తర్వాత ఇవి సర్వసాధారణం.. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలంటే అందరి చూపు అటువైపు పడుతుంది.  కొంత కాలంగా మాలో జరుగుతున్న ఎన్నికల సందంర్భంగా ఇరు పానల్స్ మద్య మాటల యుద్దం.. చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల జరిగిన మా ఎన్నికలు సైతం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను తలపించాయి.  ఒకరిపై ఒకరు మాటల యుద్దం.. వెకిలి ప్రవర్తనలు ఇలా ఎన్నో.. సోషల్ మీడియాలో చూశాం.

 

తాజాగా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అన్నట్టుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. టాలీవుడ్ లో  అగ్గి రాజేసుకుందని... తన కారు ప్రమాదానికి కూడా 'మా' పరిస్థితే కారణమని అన్నారు. చిరంజీవి ప్రసంగాన్ని కూడా తప్పుబట్టారు. దాచిపెట్టినంత మాత్రాన నిజాలు దాగవని అన్నారు. తాను అన్నీ నిజాలు మాత్రమే చెబుతున్నానని తెలిపారు.  దాంతో చిరంజీవికి చిర్రెత్తుకొచ్చింది... పక్కనే ఉన్న మోహన్ బాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తాను వేదికపై ఉండగానే హీరో రాజశేఖర్ పరుషంగా మాట్లాడడాన్ని చిరంజీవి తీవ్రంగా పరిగణించారు. ఈ సభను రసాభాస చేయడానికి ముందే ప్లాన్ చేసుకుని వచ్చారని ఆరోపించారు. ఇది వెల్ ప్లాన్డ్ చర్య తప్ప మరొకటి కాదని అన్నారు. ఇధిలా ఉంటే.. దీనిపై మా అధ్యక్షుడు నరేశ్ ఘాటుగా స్పందించారు. బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు చేస్తే కఠినచర్యలు తప్పవని అన్నారు. అంతేకాకుండా, వివాదాలపై తక్షణ చర్యల కోసం స్పాట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు లేఖ రాశారు.

 

మా అధ్యక్షుడు నరేశ్ వైఖరి మనస్తాపం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు.  వేదికపై జరిగిన రచ్చ టాలీవుడ్ లో రక రకాలుగా రూమర్లు సృష్టించాయి. మొత్తానికి ఈ  వివాద ఫలితంగానే రాజశేఖర్ 'మా' పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేసిన కాసేపటికే రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికీ ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. చివర్లో చిరంజీవి మీడియాకు ఈ విషయాలపై నెగిటీవ్ చేయొద్దని కోరారు.  కానీ వెనుక నుంచి మోహన్ బాబు న్యూస్ అప్పుడే వైరల్ అయ్యిందని ఛలోక్తి విసిరారు.  తాజాగా మా అసోసియేషన్ విషయంలో జరిగిన రచ్చపై నెటిజన్లు సైతం రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: