మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో ఎప్పుడు ఏదో ఒక అంశం మీదో ఒక ఎదో ఒక విషయంలోనో సభ్యుల మధ్య సమస్యలు తలెత్తి ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రవర్తించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడి నానా రచ్చ చేసుకుంటుమ్న్నారు. ఇది సద్దుమణుగుతుందిలే అనుకుంటుంటే ఎప్పటికప్పుడు ఇంకా విషయం పెద్దదవుతూనే ఉంది. పెద్ద వాళ్ళు ఉన్నా లెక్కచేయకుండా మా సబ్యులు కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇకతాజాగా మా డైరీ విడుదల సందర్భంగా హీరో రాజశేఖర్ అసహనం.. తొందరపాటు సంచలనంగా మారటమే కాదు.. పెద్ద రచ్చగా మారింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడటం ఒక ఎత్తు అయితే..సీనియర్ రచయిత పరుచూరి మాట్లాడుతుంటే మైకు లాగేసుకున్న పద్దతి పెను దుమారంగా మారింది.

 

రాజశేఖర్ తీరుపై చిరంజీవితో పాటు.. మోహన్ బాబు కూడా తప్పు పట్టారు. ఇక.. మా అధ్యక్షుడు నరేశ్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పరిధి దాటిన వారిపై చర్యలు తప్పవని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కమిటీకి చెప్పాలే తప్ప ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు ఎలాపడితే అలా బహిరంగంగా మాట్లాడితే ఊరుకోమన్నారు. వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలతో రాజశేఖర్ సతీమణి జీవిత కల్పించుకున్నారు. రంగంలోకి దిగిన జీవుత.. రాజశేఖర్ ది చిన్నపిల్లాడి తత్త్వమని.. ఇలాంటి కార్యక్రమంలో రాజశేఖర్ అలా మాట్లాడినందుకు క్షమించాలని తను కోరుతున్నట్లు పేర్కొన్నారు.

 

విభేదాలున్నా సరే డైరీ విడుదల కార్యక్రమాన్ని అందరూ కలిసి చేయాలని మెగాస్టార్ చెప్పారని.. తమకు.. నరేశ్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇక.. ముందు కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పటం ద్వారా.. రాజశేఖర్ చేసిన డ్యామేజ్ ను అంతో ఇంతో కంట్రోల్ అండ్ కవర్ చేసే ప్రయత్నం చేశారు జీవిత. మరి.. ఆమె చెప్పిన సారీని 'మా' పెద్దలు పరిగణలోకి తీసుకుంటారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మారింది. అయితే ఇందులో జీవుత క్షమాపణలు కోరడం వరకు బాగానే ఉంది గాని..ఆయనది చిన్నపిల్లాడి తత్వమనడమే కాస్త కామెడిగా ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: