తెలుగు టాప్ మోస్ట్ టెలివిజన్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి ఈటీవీలో పండుగలకు మల్లెమాల సంస్థ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. న్యూ ఇయర్ రోజున ఈటీవీలో ఎప్పటిలాగే ఓ స్పషల్ ప్రోగ్రాం ప్రసారం అయింది. ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అనే స్పెషల్ ప్రోగ్రాం లో నాగబాబు లేకుండానే రోజా ఒక్కటే సింగిల్ హ్యాండ్ తో షో ని రక్తి కట్టించింది. ఈ ప్రోగామ్‌లో కమెడియన్స్, సింగర్స్, డాన్స్ మాస్టర్స్, హాట్ యాంకర్స్, రోజా ఇలా రెండు వర్గాలుగా చీలిపోయి హడావిడి చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే ప్రేక్ష‌కులు నుండీ కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. 

 

అలా ఒక్క టెలివిజన్ తెరపై మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కూడా వీరి షోలు మరియు ఈవెంట్లు అదరగొడుతుంటాయి. అయితే ఈ ఈవెంట్ కు ఇప్పుడు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. వర్షిణి మరియు హైపర్ ఆదిలు యాంక‌ర్స్‌గా వ్యవహరించిన ఈ మెగా ఈవెంట్ లో ఎన్నెన్నో ప్రత్యేకలు ఉండే సరికి కేవలం ఒక్కరోజులోనే యూట్యూబ్ టాప్ 2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రియు సూపర్ స్టార్ మహేష్ ల పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.

 

అయితే వాటి మధ్యలోకి ఈ ఈవెంట్ వచ్చి నెంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఈటీవీ ఈవెంట్స్ కు తిరుగులేదని మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పాలి. కాగా, ఈ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్ కిర్రాక్ డాన్స్, హాట్ యాంకర్స్ వర్షిణి, విష్ణు ప్రియల హాట్ డాన్స్ పెరఫార్మెన్స్, సింగర్స్ మత్తెక్కించే టాప్ సాంగ్స్ ఆలపించడం, జానీ మాస్టర్ స్పెషల్ డాన్స్.. ఇలా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా టివి9 నుండి బయటికొచ్చి. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా కాస్తో కూస్తో పాపులర్ అయిన జాఫర్ తనదైన శైలిలో అది, రోజా లతో ఆడుకున్న తీరు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: