సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ చాలా తెలివిగా సినిమాలు చేస్తూ చక్క చక్క ఇండస్ట్రీలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ వరుసగా రెండు విజయాలు అందుకొన్నాడు. 'ఎఫ్ -2' తో ఫామ్ లోకి వచ్చి 'వెంకీమామతో' బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇటువంటి తరుణంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్న విక్టరీ వెంకటేష్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అసురణ్’ రీమేక్ చేయటానికి రెడీ అయ్యారు.

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న వెంకటేష్...ఈ సినిమాని తన కెరీర్ లో మహేష్ బాబు తో మొట్టమొదటి మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే  బ్లాక్ బస్టర్ సినిమా అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తో ఈ ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్లు సమాచారం. అయితే అన్నీ బాగానే ఉన్నా కానీ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి హీరోయిన్లు ముందుకు రావడం లేదని ‘అసురణ్’ రీమేక్ సినిమాలో వెంకటేష్ పక్కన నటించడానికి ముందుగా శ్రేయ హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

 

ఇండస్ట్రీలో కూడా ప్రచారం గట్టిగానే జరిగింది కానీ అనూహ్యంగా ఆమె పేరు పక్కన పెట్టి సీనియర్ హీరోయిన్ ప్రియమణి తీసుకోవడానికి వెంకటేష్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. హీరోయిన్ ప్రియమణి గత కొన్ని రోజుల నుండి చైనా సినిమాలు ఏమీ చేయటం లేదు..రీసెంట్ గా ఫ్యామిలీ మేన్ అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత తనకూ మరికొన్ని వెబ్ సిరీస్ ల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రియమణి కూడా సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వినపడుతున్నాయి. దీంతో విక్టరీ వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేయడానికి ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్నవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: