సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ మెలోడీస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మెలోడీ బ్ర‌హ్మ అని పేరు ఉండ‌నే ఉంది. ఎంతో మంది అగ్ర క‌ధానాయ‌కుల‌తో ప‌ని చేసిన ఆయ‌న మ‌హ‌ష్‌బాబు, బాల‌కృష్ణ‌, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకి అయన ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండేవాడు. అలాంటి మణిశర్మకి మెల్లమెల్లగా అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. కానీ గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్టు అయింది. 

 

ఇక ఇందులోని పాటలకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో మణిశర్మ సంగీతం మ‌ళ్ళీ ఊపందుకుంది. కం బ్యాక్ అనిపించుకున్నాడు. \సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పూర్తి.. సినిమాకి అవే మైనస్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు మణిశర్మ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఫైటర్, రామ్ రెడ్, చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా మణిశర్మనే సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ తర్వాత సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడని టాక్వం వినిపిస్తోంది. 

 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే క్రేజీ ప్రాజెక్ట్ కి మణిశర్మని ఫైనల్ చేసారని తెలుస్తుంది.  గతంలో మహేష్ - వంశీ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో తెలిసిందే.. ఈ సినిమాకి దేవి సంగీతం అందించాడు. ఇప్పుడు మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా దేవినే సంగీతం అందిస్తున్నాడు. కానీ ఆ పాటల పైన బాగా ట్రోల్ అవుతుండటంతో నెక్స్‌ట్‌ వంశీ పైడిపల్లి తో చేయబోయే సినిమాకు దేవి ప్లేస్ లో మణిశర్మ ను తీసుకోవాలని మహేష్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. చివరగా మహేష్ కి ఖలేజా సినిమాని కూడా చేశాడు మణిశర్మ. ఇక మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ - వంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అజయ్ పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సినిమాపైన భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఇక దేవి ప‌ని కాస్త అయిపోయిన‌ట్టే మ‌హేష్‌లాంటి టాప్ స్టార్ కాద‌నుకున్నాడంటే.. ఇక దేవిని ఎవ‌రైనా పెట్టుకోవ‌డానికి ఆలోచిస్తార‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: