హీరో రాజశేఖర్, నటి జీవితల అన్యోన్య దాంపత్యం సంగతి ప్రపంచానికి తెలియందేమీ లేదు. సినీరంగంలో సక్సస్ ఫుల్ ప్రేమ జంటల్లో వీరు ఒక జంట. జీవిత చెప్పిందే రాజశేఖర్ కు వేదం.. రాజశేఖర్ అడుగుల్లో అడుగేసే భార్య జీవిత. వీరి చూడచక్కని దాంపత్యానికి పూచిన పువ్వులు శివాని, శివాత్మిక. ముచ్చటైన సంసారం వీరిది.

 

అయితే ఇటీవల వీరి సంసారంలో కలతలు వస్తున్నాయా.. సంసారం అన్నాక ఎక్కడ మాత్రం గొడవలు ఉండవు చెప్పండి.. సాధారణమే కదా.. కానీ ఆ గొడవలు ఓ స్థాయి దాటితే గుది బండలవుతాయి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మనసుల్లో అల్ల కల్లోలం సృష్టిస్తాయి. ఇప్పుడు జీవిత, రాజశేఖర్ ల జీవితాల్లో అదే జరుగుతోందా.. కలతలు ఓ స్థాయిని దాటిపోయాయా.. ఇదేదో ఊహించి చెప్పే గాసిప్ వ్యవహారం కాదు.

 

మా సంసారంలోనూ కలతలు వస్తున్నాయి. ఇటీవల నాకు ప్రమాదం జరగడానికి కూడా కారణం అదే అంటూ మా డైరీ ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో సాక్షాత్తూ రాజశేఖర్ చెప్పిన విషయమే ఇది. అయితే ఆ గొడవలకు కారణంగా రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రస్తావన తీసుకొచ్చారు. మా గొడవల వల్లే తమ సంసారంలోనూ గొడవలు వస్తున్నాయని రాజశేఖర్ అంటున్నారు.

 

మరి మా వీరిద్ధరి మధ్య గొడవలకు కారణమవుతుందా.. మా విషయంలో జీవిత, రాజశేఖర్ మధ్య ఏకాభిప్రాయం లేదా.. అన్నది ఇప్పుడు ఊహాగానాలకు కారణమవుతోంది. తన కారు ప్రమాదానికి 'మా" కారణమని రాజశేఖర్ అన్నారు. అయితే రాజశేఖర్ తీరును మెగాస్టార్ చిరంజీవి, మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు తప్పు పట్టారు.

 

మా’లో మంచి ఉంటే మైక్‌లో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెబుదాం అని చిరంజీవి అన్నారు. చిన్న చిన్న బేధాభిప్రాయాలు ఉన్న అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు. రాజశేఖర్ తీరుపై మరింత ఆగ్రహం చెందిన చిరంజీవి ఆయనపై చర్య తీసుకోవాలని అన్నారు. అనంతరం రాజశేఖర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏదేమైనా మా వ్యవహారంతో రాజశేఖర్ కుటుంబం విషయం కూడా నలుగురిలోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: