సినీరంగంలో పరభాషా నటుల వల్ల కొన్ని తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. భాష రాకపోవడం వల్ల అపార్థాలు చోటుచేసుకుంటాయి. వాటి వల్ల కొన్నిసార్లు గొడవలు జరిగితే.. మరికొన్నిసార్లు నవ్వులు వెల్లివిరుస్తాయి. ఈ సంఘటన అలాంటిదే. ఈ సంఘటన ఇప్పటిది కాదులెంటి.. హీరో నాగార్జున హీరోగా సెటిల్ అవుతున్న తొలి రోజుల్లో జరిగిన ఘటన. ఇటీవల ఆ సినిమా హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో ఈ తమాషా సంఘటన గురించి చెప్పింది.

 

అసలేమైందంటే.. 1986లో ‘కెప్టెన్‌ నాగార్జున’ షూటింగ్‌ ఏవీఎం స్టూడియోలో జరిగింది.

ఆ సినిమాలో హీరో నాగార్జున, హీరోయిన ఖుష్బూ. ఖుష్బూ అప్పుడే ముంబై నుంచి వచ్చింది. అప్పటికి ఇంకా ఆమెకు తమిళ్‌, తెలుగు రావు. చిన్ని ప్రకాష్‌ డ్యాన్స్‌ మాస్టర్‌కు సతీష్‌ అనే వ్యక్తి సహాయకుడిగా ఉండేవాడు. ‘మీరు తెలుగు రాష్ట్రంలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు తెలుగులో, తమిళనాడులో జరుగుతుంటే తమిళంలో గుడ్‌మార్నింగ్‌ చెప్పాలి’ అని ఆయన అన్నారు. ‘సరే చెప్పండి’ ఎలా చెప్పాలో అని అడిగిందట ఖుష్బూ.

 

అప్పుడు గుడ్ మార్నింగ్ అని తెలుగులో చెప్పడం ఇలా అంటూ ఓ బూతు మాటను ఆమెకు చెప్పాడట సదరు సతీష్ అనే వ్యక్తి. తెలుగులో గుడ్ మార్నింగ్ ను ఇలాగే అంటారు అంటూ మాంచి నాటు బూతు పదం చెప్పాడట తమాషాకు. షూటింగ్‌ సెట్‌లో ఖుష్బూ ఓ బిల్డింగ్ పై ఉందట. అప్పుడు నాగార్జున వచ్చారట. దీంతో ఆ బ్యాడ్‌వర్డ్‌ గుడ్‌మార్నింగ్‌ అనుకొని ‘హాయ్‌ నాగ్‌’ అంటూ ఆ బూతు మాట చెప్పిందట.

 

దాంతో నాగార్జున షాక్ అయ్యారట. ఆయనతో పాటు సెట్‌లోని వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. నాగార్జున పరిగెత్తుకుంటూ వచ్చి ఖుష్బూ వెంటపడీ మరీ పట్టుకుని ‘ఈ చెత్తమాట ఎవరు చెప్పారు’ అని అడిగారు. ‘ఫలానా వ్యక్తి చెప్పాడు’ అని ఖుష్బూ చెప్పిందట. అప్పటికి శాంతించిన నాగార్జున అది ఎంత బూతో వివరించాడట. దాంతో చాలా సిగ్గుపడిపోయిందట ఖుష్బూ. భాష రాని నటుల కష్టాలు ఇలా ఉంటాయి మరి. ఆ తర్వాత ఖుష్బూ తెలుగు, తమిళ్ లో బాగా పర్ఫెక్ట్ అయ్యింది లెండి.

మరింత సమాచారం తెలుసుకోండి: