సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  రూపొందతున్న ఈచిత్రంలో  విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ ట్రెసా ,ఇజబెల్లా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా  నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుండి  ఈ నలుగురు హీరోయిన్ల ఫస్ట్ లుక్ లు విడుదలైనా  సినిమా కు ఎలాంటి  బజ్ తీసుకరాలేకపోయాయి. దాంతో  ఇప్పుడు టీజర్ తో నైనా  సినిమాకు  హైప్ తీసుకరావాలని  చిత్ర యూనిట్ భావిస్తుంది.
 
అందులో  భాగంగా ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదలచేయనున్నారు. సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు. 
ఇక గత ఏడాది  డియర్ కామ్రేడ్  తో  ప్రేక్షకులముందుకు  వచ్చిన విజయ్ కి  ఆ చిత్రం  భారీ షాక్ ఇచ్చింది.  మంచి అంచనాలతో విడుదలైన ఆసినిమా  డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది. దాంతో ఇప్పుడు  విజయ్   వరల్డ్ ఫేమస్ లవర్ పై   ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం తో హిట్ కొట్టి  మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. 
 
ఇదిలా ఉంటే  ఈ చిత్రం  తరువాత విజయ్ , మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న  ఫైటర్ లో నటించనున్నాడు.  ఈ  కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి. వచ్చే నెల  నుండి  ఈ చిత్రం  సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో విజయ్, బాక్సర్ గా కనిపించనున్నాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: