టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి కొంత గ్యాప్ తరువాత నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 5వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఎంతో గ్రాండ్ గా జరుపనున్నారు. 

 

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా జరుగనున్న ఈ వేడుకకు మెగాసూపెర్ ఈవెంట్ గా నామకరణం చేసింది సరిలేరు యూనిట్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు 50 అడుగుల కటౌట్ ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేకంగా అక్కడి అభిమానులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అతి పెద్ద మహేష్ కటౌట్ ని హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో ఏర్పాటు చేయగా, అది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రస్తుతం భీమవరంలో ఏర్పాటు చేయబడ్డ ఈ భారీ కటౌట్ ని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు. 

 

టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచిన ఈ కటౌట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, హరితేజ, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, శ్రీనివాసరెడ్డి, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రావురమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: