టాలీవుడ్ లో ఒకప్పుడు తన డ్యాన్స్ లతో ఆకట్టుకున్న కొరియోగ్రాఫర్ల లో సుందరం మాస్టర్ కూడా ఒకరు అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి పలువురు అగ్ర నటులకు డ్యాన్స్ కంపోజ్ చేసిన సుందరం మాస్టర్ గారి వారసత్వంతో టాలీవుడ్ కి డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా, ఆ తరువాత నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక అప్పట్లో దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన ప్రేమికుడు సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే నటనతో పాటు అప్పటి కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసిన ప్రభుదేవా

 

కొన్నేళ్ల క్రితం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా రూపొందిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. అయితే దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్న ప్రభుదేవా, ఆ తరువాత అదే బ్యానర్ పై ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పౌర్ణమి తీయగా, అది ఫ్లాప్ అయింది. వాటితో పాటు అక్కడక్కడా కొన్ని హిందీ సినిమాలు కూడా దర్శకత్వం వహించిన ప్రభుదేవా, కొన్నేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ తో వాంటెడ్, దబాంగ్ 2 సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవడం జరిగింది. ఇక ఇటీవల సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ 3 కి కూడా ఆయనే దర్శకత్వం వహించాడు. 

 

అయితే అది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ కావడంతో ప్రభుదేవాపై పలువురు సల్మాన్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు. అనవసరంగా సల్మాన్ ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారని, ప్రస్తుతం ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ దిశగా సాగుతోంది అంటే అందుకు ప్రభునే కారణం అని విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవతోనే రాధే అనే సినిమాలో కూడా నటిస్తుండడంతో, ఆ సినిమాకి ప్రభుదేవా ప్లేస్ లో మరొక దర్శకుడిని తీసుకోమని సలహాలు కూడా ఇస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది... !!

మరింత సమాచారం తెలుసుకోండి: