హాలీవుడ్ సినిమాల మార్కెట్ చాలా పెద్దది. అందువల్ల అక్కడ రిలీజ్ అయ్యే సినిమాల క్వాలిటీ కూడ అందుకు తగ్గట్టే ఉంటుంది. అక్కడ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టినా మళ్లీ వెన్నకి తీసుకొచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. అయితే పోయిన సంవత్సరమ్ ఇండియాలో ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. వాటన్నింటిలో కెల్లా ఆ ఏడాది ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా ఒక హాలీవుడ్ చిత్రం నిలవడం విశేషం.

 

 

ఇండియాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితా తీసుకుమ్తే దాంట్లో మొదటి స్థానంలో నిలిచిన చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. మార్వెల్ స్టూడియో నుండి విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాలన్నింటిని దాటుకుని హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం ఆశ్చర్యమే. ఈ సినిమా విడుదలకి ఏర్పడిన బజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఈ సినిమాకి భయపడి మన సినీ తారలు తమ సినిమాలని వాయిదా వేసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.

 

 

ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ఆ చిత్రం నెల రోజుల పాటు వసూళ్ల పంట పండించుకుని దేశవ్యాప్తంగా రూ.375 కోట్లు కొల్లగొట్టింది. గత ఏడాది భారతీయ బాక్సాఫీసు వద్ద సాహో, వార్, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు విడుదలయినా కూడా ఇవేవీ అవెంజర్స్ ని దాటలేకపోయాయి. గాంధీ జయంతి కానుకగా రిలీజైన 'వార్' మూవీ ఫుల్ రన్లో దేశవ్యాప్తంగా రూ.318 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రెండో స్థానంలో నిలవగా.. 'సాహో' రూ.302 కోట్ల గ్రాస్‌తో మూడో స్థానం సాధించింది.

 

 

ఇలా ఒక హాలీవుడ్ మువీ భారతీయ సినిమాల్ని దాటి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం నిజంగా ఆశ్చర్యమే. మరి మన సినిమాలు కూడా ఇలా హాలీవుడ్ లో రిలీజ్ అయ్యి డబ్బులు కొల్లగొట్టే రోజు ఎప్పుడు వస్తుందో!

 

మరింత సమాచారం తెలుసుకోండి: