టాలీవుడ్లో ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్.. మాటలతో తన సెంటిమెంట్ తో సినిమాలకు ఒక హైప్ తీసుకొస్తాడు అన్న విషయం వేరేలా చెప్పనక్కర్లేదు..సినిమాలను ఎంత చక్కగా తెరకెకకించినప్పటికీ ఎదో కొత్తగా చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.. అది టాలీవుడ్ లో త్రివిక్రమ్ కు ఉన్న క్రేజ..ప్రతి సారి కొత్తగా తన మాటల మంత్రాల వల్ల సినిమాలను సూపర్ హిట్ అందుకుంటున్నాడు..అది ఆయన గ్రేడ్ మార్క్ అనే చెప్పాలి.. 

 

స్టైలిష్ స్టార్ బన్నీ , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో అందరికీ తెలుసు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ కన్సర్ట్ జనవరి 6న జరగనుంది. ఇప్పటివరకూ విడుదలైన నాలుగు పాటలను పెద్ద సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతగా థమన్ అండ్ కో లైవ్ లో ఈ పాటలను పెర్ఫర్మ్ చేయనున్నారు. ఇక సినిమా జనవరి 12న విడుదల అవుతుందని టీమ్ ఎప్పటినుండో చెబుతూ వస్తోన్న విషయం తెల్సిందే.

 

ఈ చిత్రం నుండి బయటకు వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు మరియు సాంగ్స్ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చాయి.. కాగా మొన్న రిలీజ్ అయిన పాట మాత్రం సినిమాకు మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చింది. ఇక  ఈ సినిమా  విడుదల కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నా మూడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి..

 

అసలు విషయానికొస్తే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ గడప తొక్కడానికి ముస్తాబైంది.. రేపు సాయంత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతోంది సమాచారం..ఎది ఏమైనా కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అభిప్రాపడుతున్నారు.. మరి బన్నీ కి విజయం అందుతుందో లేదో ఈ సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: