తన నటనతో, డ్యాన్స్ తో, ఫైట్లతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఏ సినిమా తీసిన ఒక మెసెజ్ తో తీసి ప్రేక్షకుల మనసుని దోచేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే 2017 అరవింద్ సమేత సూపర్ హిట్ చిత్రం తర్వాత.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బారి బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. 

 

దీంతో అయితే ఎన్టీఆర్ అభిమానులు ఆ సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్సినిమా తీసిన ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టు శరీరాకృతి మార్చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ ఎందుకో బాగా బలిహీనమైయ్యాడు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో తెర మీదకు వచ్చిన కొన్ని ఫోటోలు చూస్తే.. అలాంటి ఫొటోలే కొన్ని న్యూ ఇయర్ సందర్భంగా తెర మీదకు వచ్చాయి. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. మొన్న న్యూఇయర్ సందర్భంగా న్యూఇయర్ విషెష్ చెప్పేందుకు ఎన్టీఆర్ ఇంటికి ఎంతోమంది అభిమానులు వచ్చారు. దీంతో ఎన్టీఆర్ తన ఇంటి మెడపై వచ్చి అభిమానులందరికి న్యూఇయర్ విషెష్ చెప్పాడు. అయితే ఆలా వచ్చినా ఎన్టీఆర్ ని కొంతమంది ఫోటోలు తీశారు.. ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. 

 

దీంతో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఆ ఫోటోలు చూసి కంగారు పడ్డారు.. సోషల్ మీడియాలో భారీ కామెంట్లు చేస్తున్నారు. అన్న ఏమైంది అన్న.. ఎందుకు ఇంత బలిహీనంగా అయ్యావు అని కొందరు కామెంట్ పెడితే.. మరికొందరు స్పందిస్తూ.. అన్న ఆరోగ్యం బాలేదా.. ఎందుకు ఇలా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొన్నదరు కామెంట్ పెడుతూ... ఎన్టీఆర్ అభిమానులు ఎం టెన్షన్ పడకండి.. మన అన్న ఏదో కొత్త లుక్ లో కనిపించేందుకు ఆలా అయి ఉంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఆ కొత్త లుక్ వెనుక అసలు కదా ఏంటో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: